తాటి చెట్టు పై నుంచి పడి గీత కార్మికుడి మృతి

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 18 (నిజం న్యూస్)
తాటి చెట్టు పై నుంచి కింద పడి గీత కార్మికుడి మృతి చెందాడు. యాదాద్రి భువనగిరి జిల్లా మోట కొండూరు మండలం కేంద్రానికి చెందిన గీత కార్మికుడు శ్రీనివాస్ గౌడ్ ఆదివారం సాయంత్రం ప్రమాదవశాత్తు తాటి చెట్టు పై నుంచి కింద పడ్డాడు.
also read: కుల బహిష్కరణ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
దీంతో తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని ఒక ప్రైవేటు తరలించగా చికిత్స పొందుతూ సోమవారం రోజున మృతి చెందాడు. అతని వయస్సు (51) సం!!.విషయం తెలుసుకున్న శ్రీనివాస్ గౌడ్ కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకోని కన్నీరు మున్నీరయ్యారు.