కుల బహిష్కరణ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 18(నిజం న్యూస్)
యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట యాదగిరి పల్లీ కల్లు గీత కార్మికుల కుల బహిష్కరణ కు గురైన మిట్ట నర్సింగ్ ,మిట్ట బిక్షపతి,మిట్ట వెంకటేశం గౌడ్ భాదితులు నిరసన దీక్ష నిర్వహించారు.యాదగిరిపల్లి కల్లు గీత కార్మిక సంఘం వారు గత 9 సంవత్సరాల క్రితం కుల బహిష్కరణ చేశారు.ఎలాంటి కారణాలు లేవు. కక్ష పూరితంగా కుల బహిష్కరణ చేసి వివిధ రకాల పండుగలకు రానివ్వ కుండా అడ్డుపడుతున్నారు.అలాగే వివాహాలు జరిగితే కూడా రానివ్వడం లేదు.వచ్చేవారిని అడ్డగిస్తున్నారు.ఇలాంటి దుశ్చర్యలను నిరసిస్తూ సోమవారమురోజున దీక్ష చేశారు.
also read: ఛత్తీస్ ఘడ్ లో చెల రేగిన మావోయిస్టులు
ఇట్టి దీక్షకు సి పి ఐ పార్టీ జిల్లా కార్యదర్శి గొద శ్రీరాములు సందర్శించి సంఘీబావం ప్రకటించారు.గొద శ్రీరాములు మాట్లాడుతూ ఇట్టి విషయాన్ని ప్రభుత్వానికి పోలీస్ వారికి బాధితులు పలుమార్లు విన్నపాలు చేసినరని బాధితుల మానసిక క్షోభకు గురి అయినరని అన్నారు.మిట్ట రాంనర్సయ్య మరణ వంగ్మూలం లో కుల బహిష్కరణ తో మానసిక క్షోభకు గురి అయ్యే చనిపోతున్నానని ప్రస్తావించారు అని ఇట్టి మరణ వాంగ్ములాన్ని కూడా కలెక్టర్ కి ఇవ్వడం జరిగింది అని వారు తెలిపారు.బాధితులకు ఎలాంటి సహకారం అందకపోవడం ముఖ్యంగా కల్లు గీత సంఘంలో సభ్యతాన్ని రద్దు చేయడం కల్లు ను అమ్మనివ్వకపోవడన్ని తీవ్రంగా విమర్శించారు.కుల బహిష్కరణ విషయంలో సమగ్రమైన విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బి సి హక్కుల సాధన సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి ఏశాల అశోక్ కూడా పాల్గొని సంఘీభావం ప్రకటించారు