ఛత్తీస్ ఘడ్ లో చెల రేగిన మావోయిస్టులు

చర్ల ఏప్రిల్ 18 ( నిజం న్యూస్) ఛత్తీస్ ఘడ్  రాష్ట్రంలోని మూడు జిల్లాలలో మావోయిస్టు చెలరేగారు. దర్బా క్యాంప్ పై మావోల దాడీ. దంతేవాడ జిల్లా రహదారి పనులకు వినియోగిస్తున్న వాహనాలను తగలబెట్టడం. సుక్మా జిల్లాలో ఇన్ఫార్మర్ నెపంతో ఒకరిని హత్య మూడు జిల్లాల్లో మావోయిస్టులు చెలరేగారు.

also read: యాదాద్రి లో పరువు హత్య..!

దంతేవాడ బీజాపూర్ మధ్యగల మంగనార్ గ్రామంలో  పి .యం.జి.యస్.వై. రహదారి పనుల నిమిత్తం కొరకు వినియోగిస్తున్న 6 ట్రాక్టర్లను నక్సల్స్ తగలబెట్టారు. ఆదివారం రాత్రి సుమారు 8 గంటల సమయంలో 150 మంది సాయుధ మావోయిస్టులు గ్రామంలో ప్రవేశించి రాదారి పనులకు ఉపయోగించే 6 ట్రాక్టర్లలో డీజిల్ తీసి వాటిపై పోసి నిప్పంటించారని. కాంట్రాక్టర్ సంతోష్ ను పనులు చేపట్టవద్దని గ్రామ సర్పంచ్, ప్రజా ప్రతినిధులను హెచ్చరించి వెళ్లారని 150 మంది లో అధికంగా మహిళలే ఉన్నారని గ్రామస్తులు చెబుతున్నట్లు సమాచారం