పడి పోవడానికి రెడీగా ఉన్నా విద్యుత్ స్తంభం

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం
నేరేడుచర్ల ఏప్రిల్ 18 (నిజం న్యూస్)
నేరేడుచర్ల మండల కేంద్రంలోని రామాపురం రోడ్లో అంజయ్య రైస్ మిల్లు వద్ద ఆదివారం పొట్టు తరలిస్తున్న ఒక లారీ స్తంభాన్ని ఢీకొట్టడంతో స్తంభం యొక్క అడుగు భాగం మొత్తం పగిలిపోయింది ఏ మాత్రం గాలి వీచినా స్తంభం పడిపోతుందని ప్రక్కన నివసించేవారు
పాదచారులు భయాందోళనలకు గురవుతున్నారు నిన్న అనగా ఈ ఘటన జరిగితే ఇంతవరకూ విద్యుత్ సిబ్బంది పట్టించుకోవడంలేదని ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎలా అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా విద్యుత్ అధికారులు స్పందించి స్తంభాన్ని మార్చ వలసినదిగా కోరుతున్నారు