యాదాద్రి లో పరువు హత్య..!

యాదాద్రి లో పరువు హత్య
యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో ఏప్రిల్ 17(నిజం న్యూస్)
యాదాద్రి భువనగిరి జిల్లాలో పరువు హత్య సంచలనం సృష్టించింది. కూతురు చేసుకున్న కులాంతర వివాహం నచ్చక కక్ష పెంచుకున్న తండ్రి అల్లుడిని దారుణంగా హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే వలిగొండ మండల కేంద్రం లింగరాజుపల్లి గ్రామానికి చెందిన ఎలుకల రామకృష్ణ గౌడ్ (32) యాదగిరిగుట్ట లో హూం గార్డ్ గా విధులు నిర్వహిస్తున్న సమయంలో యాదగిరిగుట్ట మండల కేంద్రానికి చెందిన భార్గవి ముదిరాజ్ అనే యువతితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి 2020లో వివాహం చేసుకున్నారు. వీరి ప్రేమ వివాహం నచ్చని యువతీ తండ్రి వెంకటేష్ అప్పటినుంచి వీరిపై కక్ష పెంచుకున్నడు. రెండ్రోజుల క్రితం రామకృష్ణను యువతీ తండ్రి ట్రాప్ చేసి, మాయ మాటలు చెప్పి హైదరాబాదు పిలిపించి పక్కా ప్లాన్ లతీఫ్ అనే రౌడీ షీటర్ హత్య చేయించాడు.
Also read:
అనంతరం సిద్దిపేట జిల్లాలో మృతదేహాన్ని పడేసి వచ్చినట్లు సమాచారం. అదృశ్యమైన హోంగార్డు రామకృష్ణ మృతదేహాన్ని ఆదివారం సిద్దిపేట వద్ద పోలీసులు గుర్తించారు. హోంగార్డుగా ఉద్యోగం చేస్తున్న రామకృష్ణ గుప్త నిధుల కేసులో విధుల నుంచి సస్పెండ్ అయ్యాడు. అప్పటినుంచి రియల్ ఏస్టేట్ వ్యాపారం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. రామకృష్ణకు ప్రస్తుతం 3నెలల పాప ఉంది.