Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు మౌన దీక్ష

ఖమ్మం ఏప్రిల్ 15(నిజం న్యూస్)

ప్రియుడు పెళ్ళిని అడ్డుకోబోయిన ప్రియురాలు ను కల్యాణ మండపం లో ఈడ్చి వేసిన ఘటన మారవక ముందే మరో ప్రియుడు మోసం చేశాడు అంటూ మరో ఘటన వెలుగులోకి వచ్చింది . బీసీ సామాజిక వర్గానికి చెందిన  ఓ యువకుడు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని కల్లబొల్లి కబుర్లు చెప్పి శారీరకంగా లోబర్చుకొని అబార్షన్ చేయించి ప్లేట్ ఫిరాయించాడు . తనకు న్యాయం చేయమని శుక్రవారం ఆ యువకుడి ఇంటి ముందు తనను పెళ్లి చేసుకోవాలంటూ మౌన దీక్షకు పూనుకుంది .

Also read:

బాధితురాలు ఆ యువతి దీప్తి మాట్లాడుతూ ఆటోనగర్ లో 2009లో అద్దెకు ఉంటూ వారి పేరెంట్స్ హోటల్ మరియు బాయ్స్ హాస్టల్ నడిపించే వారని ఒకే ఏరియాలో ఇంటి పక్కన ఇల్లు అవడంతో పరిచయం ఏర్పాటు అయి ప్రేమగా మారిందని , ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా ఉండే వారని 2021లో పండగలకు పబ్బానికి పిలుస్తూ కలివిడిగా ఉండే వారని . ఆ తర్వాత శ్రీనివాసరావు – మమతా దంపతుల కుమారుడు గుణగంటి పవన్ కృష్ణా ప్రేమించానని వెంటబడి లోబరుచుకుని అబార్షన్ చేయించాడని పెళ్లి చేసుకోమని అడుగుతే ఆ యువకుడు నువ్వు చచ్చిపో లేదా నేనే నిన్ను చంపుతానని బెదిరిస్తూ వారి ఇంటి మీదకు కిరాయి గూండాలను పంపించి బెదిరించారని ఆరోపించారు . ఆ విషయాన్ని ఆ పిల్లగాడి తల్లిదండ్రులకు తెలియపరిస్తే వారు కూడా మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం అంటూ తీవ్ర వేదనకు గురి చేస్తున్నారని అన్నారు . ఆ యువకుడు వారి  తల్లిదండ్రులు హైదరాబాద్ వెళ్లిన సమయాన్ని అదనుగా తీసుకుని ఇంటికి రమ్మని హత్యచారం చేసి ప్రేమించాను , పెళ్ళి చేసుకుంటాను అని మోసం చేశారని ఆ యువతి తెలిపింది . తక్షణమే ఆ యువకుడితో పెళ్లి జరిపించి తనకు , తనా కుటుంబానికి ప్రాణహాని ఉన్నందు వలన రక్షణ కల్పించలని కోరారు . తనాకు తగిన న్యాయం జరగకపోతే ఎంత దూరమైనా వెళ్తానని అన్నారు . ఈ సమాజంలో దళిత మహిళలకు రక్షణ లేకపోయిందని , స్త్రీలను మోసపూరితకంగా మోసం చేస్తూ కామాంధులు జీవిస్తున్నారని వారికి తగిన బుద్ధి చెప్పడానికి మహిళా సంఘాలు , ప్రజా ప్రతినిధులు , ప్రజాస్వామ్య వాదులు మోస పోయిన మహిళలకు న్యాయం జరిగే వరకు పోరాటానికి ముందుకు రావాలని పిలుపు నిచ్చారు .