దళితులకు 3 ఎకరాల ఇవ్వలేదు కానీ ఎమ్మెల్యే సైదిరెడ్డి 300 ఎకరాలు ఆక్రమించాడు..ఎంపీ ఉత్తమ్.

దళితులకు 3 ఎకరాల భూమిని ఇవ్వలేదు కానీ స్థానిక ఎమ్మెల్యే సైదిరెడ్డి మాత్రం 300 ఎకరాలను ఆక్రమించుకున్నాడని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం నేరేడుచర్ల మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ అనంతరం ఆయన మాట్లాడుతూ హుజూర్నగర్ నియోజకవర్గంలో అరాచక శక్తులు, దొంగలముఠా బయలుదేరింది. దళితులను, మైనార్టీలను, గిరిజనులను, బీసీలను పోలీస్ స్టేషన్ లను ఉపయోగించుకొని స్థానిక ఎమ్మెల్యే చిత్రహింసలు పెడుతున్నాడన్నారు. చిల్లేపల్లి, పెంచికల్ దిన్నె సొసైటీలలో ధాన్యం కొనుగోళ్లలో భారీ అవినీతి జరిగింది. ఈ సొసైటీలలో ధాన్యం కొనుగోలు చేయకుండా కొనుగోలు చేసినట్లు దొంగ బిల్లులను ఎత్తుకున్నారు. ఈ సొసైటీ లో జరిగిన అక్రమాలను విచారణ చేస్తున్న అధికారులను ఎమ్మెల్యే తన ఇంటికి పిలిపించుకుని ఏం మాట్లాడారు.. ఎంత కమిషన్ అడిగారో తెలియజేయాలి. చిల్లేపల్లి సొసైటీలో రెండున్నర కోట్ల అక్రమాలు జరిగినట్లు తెలుస్తుంది. ఈ అవినీతిలో ఎమ్మెల్యే తన వాటా ఎంతో తెలియజేయాలన్నారు.

also read: గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల టీచర్ల గోడు పట్టించుకునే వారు ఎవరు?

8 సంవత్సరాల క్రితం సీఎం కేసీఆర్ దళితులకు, గిరిజనులకు మూడు ఎకరాల భూమిని ఇస్తానని చెప్పి ఇంతవరకు ఇవ్వలేదన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని టిఆర్ఎస్ ప్రభుత్వాలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. బిజెపి ప్రభుత్వం మతప్రాతిపదికన హిందూ, ముస్లింలను చీల్చి లబ్ధి పొందుతుందన్నారు. బిజెపి ప్రభుత్వం అనేక సార్లు రిజర్వేషన్లకు విరుద్ధమని ప్రకటించింది. రాష్ట్రంలోని టిఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూములు ఇస్తానని ఇవ్వలేదు కానీ కొత్తగా దళిత బంధువులతో దళితులను మోసం చేయడానికి చూస్తోందని అన్నారు.