Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల టీచర్ల గోడు పట్టించుకునే వారు ఎవరు?

దమ్మపేట ఏప్రిల్14(నిజం న్యూస్)

30% ఫిట్మెంట్ తో పాటు జీఓ నంబర్ 16 రెగ్యులర్ చేయాలి

మా సర్వీసులు దృష్టిలో పెట్టుకొని మాకు న్యాయం చేయాలని సిఎం కేసిర్ కు మనవి

ప్రభుత్వ ఉద్యోగులకు ఏమాత్రం తీసిపోకుండా విధులు నిర్వర్తిస్తున్నాం

ఆహారం, ఆరోగ్యం విషయంలో పటిష్ఠమైన చర్యలు

దమ్మపేట మండలం మందలపల్లి లో ఉన్న గిరిజన సంక్షేమ పాఠశాల లో పనిచేసే టీచర్ల పరితిస్తి మరి దౌర్భాగ్యస్థితిలో నడుస్తున్నది.పేరుకు మాత్రమే పార్ట్ టైం టీచర్ విధులు మాత్రం ఫుల్ టైం చేస్తున్నాం.తెలంగాణ రాష్ట్రం లో ఉన్నటువంటి 160 పాఠశాలలు అదేవిధంగా 38 కళాశాలలు ఉన్నాయి.ఈ మొత్తం పాఠశాలలో ,కళాశాలలో కలిపి సుమారు 1953 మంది టీచర్లు,లెక్చరర్లు విధులు నిర్వర్తిస్తున్నాం.మా యొక్క జాబ్ చార్ట్ చూసినట్లయితే ఒక రెగ్యులర్ జే.యల్ మాదిరిగా,ఒక రెగ్యులర్ పి. జీ. టీ వారు ఏ విధంగా విధులు నిర్వహిస్తారో అదే విధంగా వారితో పాటు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అయిన మేము కచ్చితమైన సమయపాలనతో ఏ విషయం లో తీసిపోకుండా విధులు నిర్వర్తిస్తున్నాం.

also read: పోరస్ పరిశ్రమలో అగ్నిప్రమాదం ఆరుగురు దుర్మరణం

ఆరోగ్యం ,ఆహారం , విషయం లో పటిష్ఠమైన చర్యలు
ఉదయం నాలుగు గంటల నుంచి పి.టి ,పి.డి లు పిల్లల్ని వేకప్ చేసే వద్ద నుంచి మా యొక్క కార్యాచరణ, దినచర్య మొదలవుతుంది.అక్కడి నుంచి మళ్లీ రాత్రి 10 గంటలకు నిద్రపోయే వరకూ పిల్లల్లోనే ఉంటున్నాం. కిట్ ఇన్స్పెక్షన్ అనేది ప్రతిరోజు చేస్తూ ఉంటాం. ఇంతకీ కిట్ ఇన్స్పెక్షన్ అంటే పిల్లలకు చదువుతోపాటు వారి ఆరోగ్యం ఆహారం విషయంలో చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పిల్లల ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత మాపై ఉన్నందున వారికి లోకో పేరెంట్ గా, అదేవిధంగా హౌస్ మాస్టర్ గా వీధులను నిర్వహిస్తున్నాం. ఉపాధ్యాయులు బోధనా కార్యక్రమమే కాకుండా పిల్లల ఆరోగ్యాన్ని సంరక్షించే బాధ్యతని తీసుకోవడం జరుగుతుంది. పిల్లలకి ఒక తల్లి, తండ్రి ,గురువు అన్ని మేమే ప్రతిక్షణం మా సొంత పిల్లలను పక్కనపెట్టి పాఠశాలలో ఉండే పిల్లలను సొంత పిల్లలుగా చూసుకుంటున్నా ఘనత ఉపాధ్యాయులదే! ఉదయం క్లాసులు మొదలైన అప్పటినుంచి మధ్యాహ్నం భోజనం పీరియడ్ వరకు పాఠాలు బోధించి భోజనం సమయంలో లో డైనింగ్ హాల్ డ్యూటీని కూడా నిర్వహిస్తున్నాం. పిల్లలకి ఎటువంటి హాని కలగకుండా ఎల్లప్పుడూ పక్కనే ఉంటూ కంటిపాపలా కాపాడుకుంటున్నాం.

23 సంవత్సరాలుగా పని చేస్తున్నాం

గత 23 సంవత్సరాలుగా పార్టీ ఉద్యోగులుగా విధులు నిర్వర్తిస్తున్న మాకు అతి తక్కువ జీతాలు తీసుకొని పని చేయాల్సిన పరిస్థితి. ఇదే వృత్తికి బయట ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు 25 వేల నుండి 30 వేల వరకూ వేతనాలు వస్తున్నప్పటికీ గిరిజన పిల్లలకు సేవ చేయడమే లక్ష్యంగా పెట్టుకొని అతి తక్కువ జీవితాలతో విధులకు ఎటువంటి భంగం కలగనివ్వకుండా పనిచేస్తున్నాం. ఇక్కడ చదువుకున్న విద్యార్థులు బయట మంచి స్థాయిలో ఉన్నారంటే ఆ ఘనత మాదే! దానిని బట్టి అర్థం చేసుకోవచ్చు ఉపాధ్యాయులు పిల్లల పట్ల ఎంత శ్రద్ధ, క్రమశిక్షణతో బాధ్యత వహిస్తున్నారో.

ప్రస్తుత పరిస్థితుల్లో నిత్యావసర వస్తువులు కూడా కొనే పరిస్థితి లేదు! వచ్చే వేతనాలు తక్కువ!

నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతుంటే కనీసం ఇంటి నిమిత్తం సరుకులు కొనే పరిస్థితి వచ్చే జీతాలతో వీలు పడటం లేదు. కావున మా వేతనాలను పెంచి 30% ఫిట్మెంట్ ఇచ్చి జీవో నెంబర్ 16 ను అమలు పరచి మమ్మల్ని రెగ్యులర్ రెగ్యులర్ చేయాలని సీఎం కేసీఆర్ ను వేడుకుంటున్నాం. మా సర్వీసులను, విధులలో దృష్టిలో ఉంచుకొని న్యాయం చేయగలరని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం.