Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

పూసుకుంట విచ్చేసిన రాష్ట్ర గవర్నర్

*పూసుకుంట విచ్చేసిన రాష్ట్ర గవర్నర్*

*- తెలంగాణ రాష్ట్ర గవర్నర్ కి వినతి పత్రం సమర్పించిన ఆదివాసీ సేన.*
*- ఆదివాసీల పలు సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చిన గవర్నర్ తమిళ్ సై.*
*- గవర్నర్ ఆధ్వర్యంలో రాజ్ భవన్ & ఏజెన్సీ ఏరియా నందు ఆదివాసీ ప్రజా దర్భార్ నిర్వహించాలి.*
*- న్యాయ విచారణ కొరకు ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేయాలి.*
*- ఐ టి డి ఏ కేంద్రంలో రక్తనిధి కేంద్రాలు, మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలి.*
*- ఆదివాసీ ఆత్మ గౌరవ్ పథకం ను రూపొందించాలి.*

భద్రాద్రి బ్యూరో ఏప్రిల్ 12 (నిజం న్యూస్)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట. 5వ షెడ్యూల్ అధికారాల ద్వారా.. రాష్ట్రం లో ఆదివాసీల ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కరించాలని కోరుతూ.. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ కి ఆదివాసీ సేన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ నేతృత్వంలో పూసుకుంట గ్రామంనందు., షెడ్యూల్డ్ ప్రాంతంలో గల ఆదివాసీ సమస్యల పరిష్కారం, శాంతి, సుపరిపాలన కొరకు విశిష్ట అధికారాలు కలిగిన తమరికి ఆదివాసీలు వారి సమస్యలు తెలియజేయుట కొరకు ప్రతి నెలలో ఒక రోజున గవర్నర్ ఆధ్వర్యంలో రాజ్ భవన్ మరియు ఏజెన్సీ ఏరియా నందు *“ఆదివాసి ప్రజా దర్బార్”* నిర్వహించి గౌరవ రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్డ్ స్పూర్తితో ఆదివాసీల సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తిసుకునేవిధంగా.,
తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో షెడ్యూల్ ప్రాంత కేసులకు, గిరిజనులకు సత్వర న్యాయం అందించడానికి సంబంధించి విచారణ కొరకు (కోనేరు రంగారావు కమిటి సిఫారసుల అనుసారంగా) ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేసేలా తగు చర్యలు తీసుకోనే విధంగా., ఆదివాసీలు అధికముగా ఉన్నటువంటి నాన్ –ఏజెన్సీ గ్రామాలను షెడ్యూల్డ్ ప్రాంత గ్రామాలుగా గుర్తించుటకు తగిన చర్యలు తీసుకునేలా.,
షెడ్యూల్ ప్రాంతాలలో గల వైద్యశాలలో ప్రత్యేకమైన వైద్య సదుపాయాలు, సేవలు 24 గంటలు అందుబాటులో వుండేవిధంగా., ఆదివాసి మహిళలకు, పిల్లలకు రక్తహీనత, పౌష్టికాహారం అందించుట మరియు ప్రతి ఐటిడిఏ కేంద్రాలలో రక్తనిధి కేంద్రాలు ఏర్పాటు చేసే విధంగా తగు చర్యలు తిసుకునేవిధంగా..,
తెలంగాణ రాష్ట్రంనకు మంజూరైన గిరిజన యూనివర్సిటీ పూర్తి స్థాయిలో అందుబాటులోనికి వచ్చేలా, ఐటీడీఏలు కేంద్రంగా మెడికల్ కళాశాల ఏర్పాటు చేసి, గిరిజన ప్రాంతాలలో వివిధ చోట్ల పలు అనుబంధ కళాశాలలు ఏర్పాటు చేసేలా.,
ప్రస్తుతం డిజిటల్ సేవలు, 4జి సేవలు – ప్రతి ఆదివాసీ గ్రామంలో నిరంతరం ఆదివాసీలు పొందేలా, తగు చర్యలు తీసుకునే విధంగా,
ఆదివాసీ నిరుద్యోగులు, యువత, మహిళల ల ఆర్థిక పరిపుష్టత, స్వావలంబన కొరకు ప్రత్యేకంగా *ఆదివాసీ ఆత్మ గౌరవ్* పథకం నూ రూపొందించి వడ్డీలేని, రాయితీ తో కూడిన పథకాలను ప్రతి ఆదివాసీ గూడెంలలో (30) మందికి ఇచ్చేలా…. పూర్తిగా 41 యొక్క అంశాలతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించడం జరిగినది. ఆదివాసీల సమస్యల పరిష్కరిస్తామని ఈ సందర్భంగా గవర్నర్ హామీ ఇచ్చినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ నాయకులు వగ్గెల రామక్రిష్ణ, శెట్టిపల్లి శ్రీను, దుబ్బ భాస్కర్, సొడే శ్రీను, తానం శివ, కారం వెంకటేష్, సడియం ప్రవీణ్, కు వెంకటేష్, సడియం వీరభద్రం, కురం చిలకారావు, కణితి వెంకటేష్, కుర్సం నగేష్ , వెంకన్న తదితరులు పాల్గొన్నారు.