గ్రామపంచాయతీ నుండి గెంటేసిన కార్యదర్శి పై ఫిర్యాదు

చందుర్తి ఏప్రిల్ 12 (నిజం న్యూస్ ):చందుర్తి మండలం అనంతపల్లి గ్రామ పంచాయితీ పంచాయతీ కార్యదర్శి ప్రసాద్ తనను అకారణంగా షర్టు కాలర్ పట్టి గ్రామపంచాయతీ నుండి నెట్టి వేశాడని అతనిపై చర్యలు తీసుకోవాలని అనంతపల్లి గ్రామానికి చెందిన చిలుక బాబు మంగళవారం చందుర్తి ఎస్ఐ శ్రీకాంత్ కు ఫిర్యాదు చేశారు.

also read: విచారణ కోసం పిలిచి చెయ్యి చేసుకున్న ఎస్ఐ!

తన ఇంటిముందు మిషన్ భగీరథ మంచినీళ్లు లీక్ అవుతుండగా పైపు కోసం గ్రామ పంచాయతీ కార్యాలయానికి వెళ్లగా నీవు ఇంటి పన్ను చెల్లించడం లేదంటూ దుర్భాషలాడుతూ కాలర్ పట్టి గెంటి వేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయమైన ఎస్సై శ్రీకాంత్ ను వివరణ కోరగా అనంత పల్లి పంచాయతీ కార్యదర్శి ఇదే గ్రామానికి చెందిన బాబు ను కలర్ పట్టి గెంటివేశాడని ఫిర్యాదు అందిందని. ఈ విషయంపై విచారణ చేపడతామని అన్నారు.