విచారణ కోసం పిలిచి చెయ్యి చేసుకున్న ఎస్ఐ!

విచారణ కోసం పిలిచి, వ్యక్తిపై చెయ్యి చేసుకున్న ఎస్ఐ!

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో.

జరిగిన సంఘటనపై సూర్యాపేట ఎస్పీ, పూర్తి స్థాయిలో విచారణ జరిపి, ఎస్సై పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని బాధితుల , ప్రజలు డిమాండ్.

సూర్యాపేట ,ఏప్రిల్ 12 నిజం న్యూస్

చిలుకూరు పోలీస్ స్టేషన్ కు ఓ వ్యక్తిని విచారణ కోసం పిలిచిన ఎస్సై శ్రీనివాస్ యాదవ్ ,అతనిపై చెయ్యిచేసుకున్న వీడియోసామాజికమాధ్యమాల్లో వైరల్గా మారింది.దీనితో స్పందించిన చిలుకూరు ఎస్ఐ శ్రీనివాస్ యాదవ్, అతను అమర్యాదగా మాట్లాడటం వల్లనే చెయ్యి చేసుకున్నట్లు తెలిపినట్లు సమాచారం. కేసు ఏమిటి, అతను ఎందుకు అమర్యాదగా మాట్లాడాల్సి వచ్చింది,ఎస్ఐ చెయ్యి చేసుకునే పరిస్థితి ఎందుకొచ్చిందనేది తెలియాల్సి ఉంది.

Also read: చర్ల లో గుప్త నిధులు లభ్యం.!

ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో ఒకపక్క పోలీస్ శాఖ ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పుకుంటూ మరొక ప్రక్క బాధితులకు చుక్కలు చూపిస్తున్నడంతో ఇదేమిటని సామాజిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు.. జరిగిన సంఘటనపై, సూర్యాపేట ఎస్పీ పూర్తిస్థాయిలో విచారణ జరిపి, ఎస్ ఐ తీరుపై, శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు మేధావులు యువత కోరుతున్నారు.