శిధిలావస్థకు ఆమడ దూరంలో వైకుంఠధామం

దమ్మపేట ఏప్రిల్ 11(నిజం న్యూస్)

* రేపో, మాపో కూలిపోవటానికి సంసిద్ధం.

* నిర్మాణానికి నాసిరకమైన సిమెంట్, దుబ్బ ఇసుక కారణం అంటున్న ప్రజలు.

* ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం చేసిన సర్పంచ్ భర్త.

* ఎక్కడికక్కడ చీలికలే.

దమ్మపేట మండలం


మందలపల్లి లో వైకుంఠదానం శిధిలావస్థకు ఆమడ దూరంలో ఉన్నది. ఇక విషయానికి వస్తే మందలపల్లి లో చాలా సంవత్సరాలుగా స్మశాన వాటిక లేక స్థానికులు చాలా ఇబ్బందులు పడేవారు.చనిపోయిన శవాన్ని పూడ్చి పెట్టడానికి లేదా కాల్చడానికి చెరువులు, కుంటలు రహదారులు ఇలా ఎక్కడ పడితే అక్కడ దహన సంస్కారాలు చేసేవారు. ప్రజలు పడే అవస్థలు చూడలేక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రాష్ట్ర వ్యాప్తంగా వైకుంఠ దానాలకు నిధులు మంజూరు చేస్తే వాటిని దుర్వినియోగం చేసిన సంఘటన మందలపల్లి లో చోటు చేసుకుంది. పంచాయతీ సర్పంచ్ భర్త ఈ వైకుంఠధామం కాంట్రాక్ట్ ని తీసుకొని నిర్మించారు. డబ్బులు దండుకోవడం కోసం నాసిరకమైన సిమెంటును, అదే విధముగా పంట పొలములలో ఉండే దుబ్బ ఇసుకను ఈ నిర్మాణం నిమిత్తం వాడారని పంచాయతీ ప్రజలు బాహాటంగానే చెప్పుకుంటున్నారు.

also read:ఆర్టీసీడ్రైవర్‌ పై టీచర్ దాడి

ఈ కట్టడం పూర్తి చేసి ఎన్నో నెలలు కూడా కావడం లేదు కానీ షెడ్ కి చుట్టుపక్కల ఎక్కడికక్కడ పగిలిపోవడం చూసి స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. ప్రభుత్వం కట్టించిన వాటిని కూడా సరిగ్గా కట్టడం లేదని ధనాన్ని దండుకోవడానికి ఇలా చేశారని గ్రామ ప్రజలు వాపోతున్నారు. ఈ వైకుంఠదానాన్ని కట్టినప్పటినుంచి ఇప్పటివరకు 1 నుంచి 2 శవాలను కాల్చగా ఆ సిమెంటు దిమ్మ మొత్తం పగిలి చీలిపోవడం ఆశ్చర్యమైన విషయం. అంటే నిర్మాణం ఎంత బలంగా ఉందో అర్థం అవుతూనే ఉంది. ప్రభుత్వ సొమ్ము ప్రజలకు ఉపయోగపడే విధంగా వాడకుండా దుర్వినియోగం చేయటం సరికాదని, లక్షల రూపాయలు తో కట్టించినా దానివలన ఫలితం లేదని ఆరోపిస్తున్నారు. దీనిపై వెంటనే అధికార యంత్రాంగం స్పందించి చర్యలు తీసుకొని పూర్తిస్థాయి మరమ్మతులు వారి సొంత ఖర్చుతో సమకూర్చాలని పంచాయితీ వాసులు అధికారులను కోరుకుంటున్నారు.