పట్టు తప్పితే అంతే సంగతి

గద్వాల జిల్లా,: నిజం న్యూస్
ఏప్రిల్ 11: గద్వాల నుంచి ధరూర్ వైపు వెళ్తున్న టాటా మ్యాజిక్ ఆటో లో కిక్కిరిసిన జనాలతో తీసుకెళుతున్న దృశ్యం. ఆటో వెనకాల వేలాడుతూ ప్రయాణిస్తున్న విద్యార్థులు.ఇటు పోలీస్ అధికారులు అటు ట్రాఫిక్ పోలీస్ అధికారులు ఎన్నిసార్లు అవగాహన కలిగించిన కూడా పోలీసు అధికారులు చెప్పే మాటలను తూతూ మంత్రంగా భావించి ఎప్పట్లాగానే ఆటోలో కిక్కిరిసిన జనాలతో తీసుకుపోవడం.ఆనవాయితీగా మారింది. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో గద్వాల నుంచి ధరూర్ వైపు వెళ్తున్న ఆటోలో కిక్కిరిసిన జనాలతో వెనక ఎలాంటి పట్టు లేకుండాగా వేలాడుతున్న విద్యార్థులు ప్రమాదకరంగా ఉన్నప్పటికీ ఆటోడ్రైవర్ స్వలాభం కోసం ఇంత మందిని ఆటోలో ఎక్కించుకోవడం దారుణం. ప్రతినిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్న అదేమీ లెక్కచేయకుండా తీసుకోకపోవడం ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం గా చెప్పవచ్చు. పోలీస్ అధికారులు ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. ఆర్టీఏ అధికారులు కూడా చర్యలు చేపట్టాలని పట్టణ ప్రజలు భావిస్తున్నారు