కంచికచర్ల మిక్ ఇంజనీరింగ్ కాలేజి లో తన్నులాట

-కంచికచర్ల మిక్ ఇంజనీరింగ్ కాలేజి రెండవ సంవత్సరం డిప్లమా విద్యార్థులపై మొదటి సంవత్సరం డిప్లమా విద్యార్థులు దాడి

– హాకీ బ్యాట్లతో బీరు సీసాలతో దాడులు ముగ్గురు విద్యార్థులకు తీవ్రగాయాలు నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

-ఒక విద్యార్థికి కంటిపై తీవ్రగాయాలు మరో విద్యార్థికి కాలికి తీవ్ర గాయాలు

డిప్లొమా రెండవ సంవత్సరం చదువుతున్న కార్తీక్ అనే విద్యార్థి ఇన్స్టాగ్రామ్ లో తన ఫోటో షేర్ చేసుకున్నాడు.ఫోటోకు అసభ్యపదజాలంతో కామెంట్ పెట్టిన డిప్లొమా మొదటి సంవత్సరం విద్యార్థి షాహుల్, కామెంట్ ఎందుకు పెట్టావు అని అడిగిన కార్తీక్, వారిరువురి మధ్య తోపులాట జరిగింది సర్ది చెప్పిన కాలేజీ యాజమాన్యం అందరి విద్యార్థుల ముందు అడిగినందుకు మనసులో పెట్టుకొని ఈరోజు షాహుల్ తన అనుచరులు 12 మంది కలసి షణ్ముక్,కార్తీక్,ఆంజనేయులు పై తీవ్రంగా దాడి చేసి పరారయ్యారు.

also read : స్కూలు పిల్లల ఆటోకు ప్రమాదం

హాస్పిటల్ కు చేరుకున్న సి.ఐ నాగేంద్రకుమార్ కాలేజీ విద్యార్థుల నుండి వివరణ తీసుకొని విద్యార్థుల మద్య రెండు రోజుల నుండి గొడవ జరుగుతుందని తెలుసుకొని యాజమాన్యం,సిబ్బంది అలసత్వం వలననే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని మీ కాలేజీలో మాత్రమే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని ఎలాంటి గొడవలు జరిగినా పోలీసులకు తెలియపరచటం లేదని మీకు భాద్యత లేదా అని ప్రశ్నించారు .

ఇకపై ఇలాంటి సంఘటనలు జరిగితే కాలేజీ యాజమాన్యం పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు