స్కూలు పిల్లల ఆటోకు ప్రమాదం

మునగాల, ఏప్రిల్11,(నిజం న్యూస్);
మునగాల మండలం కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్ ముందు స్కూలు పిల్లలతో రోడ్డు దాటుతున్న ఆటోను హైదరాబాదు నుండి విజయవాడ వైపు వెళ్తున్న కారు అతివేగంతో ఢీ కొట్టడంతో స్కూల్ విద్యార్థుల ఆటో పల్టీ కొట్టింది,ఆటోలో ఉన్న విద్యార్థులకు ఎటువంటి గాయాలు, ప్రమాదం జరగలేదు.
Also read: ఢిల్లీలో నిరసన దీక్ష ఏర్పాట్లను పరిశీలన
విద్యార్థుల క్షేమంగా బయటపడటంతో స్కూలు యాజమాన్యం,తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు,ప్రమాదానికి గురైన ఆటో బరఖాత్ గూడెం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు,ఆటోలో ఉన్న విద్యార్థులు అదే గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు, ప్రమాదం జరిగినప్పుడు ఆటోలో పది మంది విద్యార్థులు ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు,ఈ విషయంపై హుటాహుటిన స్పందించిన పోలీసు వారు ప్రథమ చికిత్స కోసం విద్యార్థులను ప్రైవేట్ హాస్పిటల్ లో చేర్పించి విద్యార్థులకు ప్రథమ చికిత్స అందించారు,ప్రమాదానికి కారణమైన కారును అదుపులోకి తీసుకొని ఎంక్వయిరీ చేసి కేసు నమోదు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.