గదికి నీళ్లు పెడుతుండగా కరెంటు షాక్.. వ్యక్తి మృతి

బచ్చన్నపేట ఏప్రిల్ 10(నిజం న్యూస్):
బచ్చన్నపేట మండలం బసిరెడ్డిపల్లి గ్రామంలో కరెంటు షాక్ తో ఎద్దు వెంకటేష్ ఆదివారం తెల్లవారు జామున కరెంట్ షాక్ తో మృతి చెందినట్లు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం ఎద్దు వెంకటేష్ (45) ఆదివారం పొద్దున తన ఇంటి వెనుకాల కొత్తగా నిర్మిస్తున్న గదికి నీళ్లు పడుతుండగా కరెంటు షాక్ కొట్టడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఇది గమనించిన స్థానికులు వెంటనే జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు.
Also read: ఎన్ సి ఎల్ కు రూ. 91,42,66,220ల జరిమాన..?
అందరితో కలిసిమెలిసి తిరిగే వెంకటేష్ మృతి చెందడంతో బసిరెడ్డిపల్లి గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.మృతిడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.మృతుడి కుటుంబానికి ప్రభుత్వం 25,00,000 లక్షల ఎక్స్ గ్రేశియ చెల్లించి,ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.