మావోయిస్టు పార్టీ ఎల్జిఎస్ యాక్షన్ టీం కమాండర్.. రాజేష్ కోసం పోలీసులు గాలింపు

– జిల్లా ఎస్పీ సునీల్ దత్

చర్ల ఏప్రిల్ 8 (నిజం న్యూస్) చర్ల ఏరియా మావోయిస్టు పార్టీ ఎల్. జి ఎస్ .యాక్షన్ టీం కమాండర్ రాజేష్ కోసం పోలీసులు గాలింపుచర్యలు చేపట్టారని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్ శుక్రవారం ఓ ప్రకటన లో వెల్లడించారు చర్ల సీఐ బి అశోక్ సిబ్బందితో కలసి పెద మిడిసిలెరు గ్రామ శివారులో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా కిష్టారం పాడు బత్తిని పల్లి గ్రామాల మధ్య లో ట్రెన్సింగ్ పనుల నిమిత్తం అక్కడ ఉన్న బ్లేడ్ ట్రాక్టర్లను . జెసిబి ని తగలబెట్టి డానికి మావోయిస్టు యాక్షన్ టీం అక్కడకు వచ్చిందని సమాచారం అందగానే వెంటనే సిఐ.బిఅశోక్ సిబ్బందితో ట్రెన్సింగ్ పనులు జరిగే ప్రదేశానికి సిబ్బందితో కలసి బయలుదేరారని ఎస్ పి. సునీల్ దత్ ప్రకటనలో పేర్కొన్నారు. ఆ ప్రదేశానికి కొంచెం దూరంలో లో ఉండగా ఆయుధాలతో ఉన్న పోలీస్ పార్టీ ని చూసి చర్ల ఏరియా మావోయిస్టు పార్టీ ఎల్. జి ఎస్ .టీం కమాండర్ రాజేష్. ఇద్దరు దళ సభ్యులతో బత్తిని పళ్లి వైపు పారిపోవటం జరిగిందని తెలిపారు అటవీ ప్రాంతంలో వారి కోసం గాలింపు చర్యలు చేపట్టగా అటవీప్రాంతంలో పోలీసులపై కాల్పులు జరిపి పారిపోయారని అన్నారు .అటవీ అధికారులు పనుల నిమిత్తం ఏర్పాటు చేసిన జెసిబి .ట్రాక్టర్లను తగలబెట్టడానికి డీజిల్ కోసం ఎదురుచూస్తున్న నిషేధిత మావోయిస్టు పార్టీ పోలీసులపై ఎదురు కాల్పులు జరిపి పారిపోయారని . బీడాకు కాంట్రాక్టర్లను బెదిరించి అక్రమం గా డబ్బులు వసూలు చేయడం. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను అడ్డుకోవడం కోసం మావోయిస్టు పార్టీ నాయకుల ఆదేశాలతో యాక్షన్ టీం ఏ ప్రాంతంలో సంచరిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం ఉందని ఎస్పీ ప్రకటనలోతెలిపారు పోలీసులపై కాల్పులు జరిపి పారిపోయిన చర్ల ఏరియా మావోయిస్టు పార్టీ ఎల్. జి ఎస్. యాక్షన్ టీం కమాండర్ రాజేష్ కోసం పోలీసు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ఎస్పి తెలిపారు.