మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా కేటీఆర్‌తో భేటీ

హైదరాబాద్: మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా శుక్రవారం హైదరాబాద్‌లో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ను కలిశారు. మేఘాలయ సిఎం కాన్రాడ్ సంగ్మా తన ట్విట్టర్ హ్యాండిల్‌లో “నా ప్రియమైన స్నేహితుడు మరియు ఐటీఈ & కమ్యూనికేషన్ మంత్రి శ్రీ @KTRTRS మరియు అతని భార్యను హైదరాబాద్‌లోని వారి నివాసంలో కలుసుకున్నందుకు ఆనందంగా ఉంది” అని ట్వీట్ చేశారు.కాన్రాడ్ సంగ్మా ట్వీట్‌పై స్పందించిన కేటీఆర్ “డియర్ @సంగ్మాకాన్రాడ్ జీని కలవడం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంది” అని ట్వీట్ చేశారు.హైదరాబాద్ పర్యటనలో ఉన్న మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా ప్రగతి భవన్‌లో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌తో సమావేశమై పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. మేఘాలయ, తెలంగాణ రాష్ట్రాల మధ్య సంబంధాలు, వ్యాపారాలపై ఐటీ మంత్రి చర్చించినట్లు సమాచారం.