పేదరికం వల్ల చదువు ఆగిపోకూడదు.. వైఎస్ జగన్

పిల్లలకు తల్లిదండ్రులు ఇచ్చే నిజమైన ఆస్తి చదువు అని, పేదరికం వల్ల చదువును ఎట్టి పరిస్థితుల్లో ఆపకూడదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. నంద్యాల జిల్లాలో జగనన్న వసతి దీవెన రెండో విడత నిధుల విడుదల కార్యక్రమంలో విద్యార్థులు, తల్లులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు చదువు ఒక్కటే ఆస్తి అని పునరుద్ఘాటించారు.విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని, పేదరికంతో చదువు ఆగిపోకూడదని, పిల్లలకు చదువు చెప్పకపోతే ఆ కుటుంబాలు పేదరికం నుంచి బయటపడవని వైఎస్ జగన్ అన్నారు. విద్యాసంస్థల్లో సౌకర్యాలు మరింత మెరుగుపరుస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారని, పిల్లలకు చదువుతో పాటు మంచి భోజనం అందించడం గర్వకారణమని అభిప్రాయపడ్డారు.ప్రభుత్వం ద్విభాషా పుస్తకాలను తీసుకురావడం ద్వారా క్రమంగా ఆంగ్ల మాధ్యమం వైపు అడుగులు వేస్తోందని వైఎస్ జగన్ అన్నారు. తల్లులు బాగుంటే బిడ్డలు కూడా బాగుండాలనే ఉద్దేశ్యంతో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు.