హనుమకొండ జిల్లా శాయంపేట మండలం మందారిపేట వద్ద గోర రోడ్ ప్రమాదం.

హైదరాబాద్ బ్యూరో ఏప్రిల్ 8 (నిజం న్యూస్ )

కూలీలతో వెళ్తున్న అశోక్ లేలాండ్ ట్రాలీ వాహనాన్ని లారీ ఢీకొట్టడంతో ట్రాలీ లో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళా కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు . మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలిసింది.వివరాల్లోకి వెళితే… శాయంపేట మండలం పత్తిపాక గ్రామానికి చెందిన 25 మంది మహిళలు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం లో మిర్చి తోటలో వేరే అందుకు శుక్రవారం ఉదయాన్నే మొగుళ్లపల్లి కు చెందిన అశోక్ లేలాండ్ ట్రాలీ లో బయలుదేరిన కొద్ది సేపటికే ఎదురుగా వస్తున్న లారీ సైడ్ నుంచి తగలడంతో ర్యాలీలో సైడ్ నిలబడిన వారందరినీ గుద్దుకుంటూ వెళ్లడంతో ఇద్దరు స్పాట్ డెడ్ కాగా మరో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి . విషయం తెలుసుకున్న పరకాల ఏసిపి సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడ్డ వారిని వరంగల్ ఎంజీఎం కు అదే ట్రాలీ లో చికిత్స నిమిత్తం తరలించారు.