మోసం చేశాడని ప్రియుడి ఇంటిముందు నిరసన

రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్7 (నిజం న్యూస్):

వీర్ణపల్లి మండలం గర్జనపల్లి గ్రామ జవహర్ లాల్ నాయక్ తండా వాస్తవ్యులు భూక్యా అభిలాష్ (23) తండ్రి కిషన్ ఇంటి వద్ద ప్రేమ పేరుతో మోసం చేశాడని రద్రంగి మండలం మానాల గ్రామానికి చెందిన గుగులోతు మమత (20) తండ్రి గజన్ తో కలిసి కుటుంబ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. బాధితురాలు మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా అభిలాష్ తను ప్రేమించుకున్నామని, తన తల్లి తండ్రుల తో మాట్లాడి పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పి, హైదరాబాద్ అంత తిప్పాడని, తను ఉద్యోగం చేస్తున్నపుడు వచ్చిన డబ్బులను కూడా గత సంత్సరకాలంగా అభిలాష్ కే ఇచ్చానని చెప్పుకొచ్చింది. డబ్బుల అవసరం ఎక్కువై చెవి కమ్మలు బ్యాంక్ లో తాకట్టు పెట్టి డబ్బులు ఇవ్వాలని వేధించాడని ఆవేదన వ్యక్తం చేసింది. కానీ ఇప్పుడు మాట మార్చి తాను పెళ్లి చేసుకోనని, ఎం చేసుకుంటావో చేసుకోమని, ఒకవేళ నిన్ను చేసుకుంటే మా తల్లిదండ్రులు ఉరివేసుకొని చనిపోతారని భేదిరిస్తున్నాడని చెప్పుకొచ్చారు. తమ ఆడపిల్లకు న్యాయం జరిగే వరకు ఎంత దూరమైన వెళ్తామని కుటుంబ సభ్యులు ప్రకటించారు.