వాలంటీర్ల సేవలకు వైఎస్ జగన్ సెల్యూట్.
యావత్ దేశం యావత్ రాష్ట్రంలోని స్వచ్చంద వ్యవస్థ వైపు చూస్తోందని ఇది గర్వించదగ్గ తరుణమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో గురువారం జరిగిన వాలంటీర్లకు వందన సమర్పణ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.నూతనంగా ఏర్పాటైన పల్నాడు జిల్లా జిల్లా కేంద్రమైన నరసరావుపేట నుంచి స్వచ్ఛంద సేవా సంస్థ సేవలకు సెల్యూట్ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.
వివక్ష, లంచగొండితనం, అవినీతి లేని, కుల రాజకీయాలకు తావులేని వ్యవస్థ కావాలన్న తన కల స్వచ్చంద సంస్థ ద్వారా సాకారమైందని సీఎం జగన్ అన్నారు.వాలంటీర్ వ్యవస్థ దేశంలోనే గొప్ప వ్యవస్థగా మారిందని వైఎస్ జగన్ అన్నారు. లాభనష్టాలతో నిమిత్తం లేకుండా అత్యధిక సంఖ్యలో వలంటీర్లతో సేవాకార్యక్రమాలు ముందుకు సాగుతున్నాయని సీఎం జగన్ గుర్తు చేశారు. కాగా, రావిపాడు గ్రామ వాలంటీర్ రజిత, వాలంటీర్లందరి తరపున సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ఏపీలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల విశేషాలను వివరించారు.