విద్యుత్ చార్జీల పెంపునకు నిరసనగా రేవంత్ రెడ్డి హౌస్ అరెస్ట్

నిజం న్యూస్ :
హైదరాబాద్‌లో విద్యుత్ చార్జీలు, ఇంధన ధరల పెంపునకు వ్యతిరేకంగా నిరసనలకు పిలుపునిచ్చిన పలువురు తెలంగాణ కాంగ్రెస్ నేతలను పోలీసులు గురువారం నాడు హైదరాబాద్‌లో హౌస్ అరెస్ట్ చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్, సీనియర్ నేతలు షబ్బీర్ అలీ, మల్లు రవి, దాసోజు శ్రవణ్, హర్కర వేణుగోపాల్, బక్కా జడ్సన్, నగేశ్ ముదిరాజ్‌లను హౌస్ అరెస్ట్ చేశారు.ఇంధన ధరలు, కరెంటు చార్జీలు, వరి ధాన్యం కొనుగోళ్లను ప్రభుత్వం తగ్గించే వరకు కాంగ్రెస్ పోరాడుతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిన్న అన్నారు. ఇవాళ విద్యుత్ సౌధ, పౌరసరఫరాల భవన్ ముట్టడికి ఆయన పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ఈ మేరకు ముందస్తు చర్యలు చేపట్టారు. రేవంత్ హౌస్ అరెస్ట్ నేపథ్యంలో జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు.