పవన్ కళ్యాణ్ దురుద్దేశపూరిత ప్రచారం… కన్నబాబు

తాడేపల్లి: వ్యవసాయ రంగంలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉందని కేంద్ర ప్రభుత్వమే సర్టిఫికెట్ ఇచ్చిందని, అంతకు మించి పవన్ కల్యాణ్‌కు ఏం కావాలని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ప్రశ్నించారు.బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మంత్రి.. రైతు ఆత్మహత్యలపై పవన్ కల్యాణ్ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తన రైతు భరోసా యాత్ర కొన్ని స్వార్థ ప్రయోజనాల కోసమేనని అన్నారు. టీడీపీ ఆదేశాల మేరకే పవన్ రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.
రైతు ఆత్మహత్యల వివరాలకు సంబంధించి తన సోర్స్‌ను ఆయన ప్రశ్నించారు. పీఎం కిసాన్ పథకం కింద కౌలు రైతులకు వర్తింపజేయకపోవడంపై కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని మంత్రి పవన్ కల్యాణ్‌ను ప్రశ్నించారు.రాష్ట్ర ప్రభుత్వ విధానమే రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధి అని మంత్రి పునరుద్ఘాటించారు. రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులకు అన్ని రకాల పథకాలు అందజేస్తోందని గుర్తు చేశారు. వ్యవసాయరంగానికి ప్రభుత్వం ఏటా బడ్జెట్‌లో కేటాయింపులు పెంచుతూ ప్రత్యేక పథకాలు అమలు చేస్తోందన్నారు.