ప్రయాణికులతో ఆర్టీసీ అధికారి దుర్భాషలాట..?

-నన్ను పీకేదవుడు లేడు ఇష్టం వచ్చిన చోట చెప్పుకోండి

-నా ఇష్టం ఉన్న చోట బస్సు ఎంతసేపైనా ఆపుతాను చెక్ చేస్తాను

– సదరు ఆర్టీసీ అధికారి తీరు

-ఆ అధికారి నీ తిట్టిపోసిన ప్రయాణికులు

– మహిళలు సదరు అధికారి ని విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు

నిజామాబాద్ బ్యూరో, ఏప్రిల్ 6 (నిజం న్యూస్): నిజామాబాద్ జిల్లా ఆర్టీసీ డిపోకు చెందిన ఒక అధికారి కానీ అతని ప్రవర్తన అంతుబట్టడం లేదు ప్రయాణికుల పట్ల దుర్భాషలాడుతూ పలువురిని బెదిరించి బస్సు ని కమ్మర్పల్లి బస్టాప్ వద్ద టికెట్లు తీసుకుంటూ చెకింగ్ చేయడానికి తనకు అన్ని అధికారాలు ఉన్నాయి అవసరమైతే టికెట్ ఉన్న ఫైన్ కూడా వేస్తాను నన్ను పీకేది ఎవరు నేనే నిజామాబాద్ జిల్లా అన్ని డిపోలకు హెడ్ ను మా ఇష్టం వచ్చిన చోట బస్సును ఆపుతాను అవసరమైతే బస్సులోంచి ప్రయాణికుల్ని బయటకు గెంటేస్తారు అని పలువురు ప్రయాణీకుల పట్ల దుర్భాషలాడి బస్ పాసులు అలాగే తీసుకోవడం జరిగింది.

also read: చర్ల టీఆర్ఎస్ లో భగ్గుమన్న వర్గ విభేదాలు

ఇట్టి విషయమై మేము గారికి ట్విట్టర్ ద్వారా కంప్లీట్ చేస్తాము అని ఒక యువకుడు తెలపగా వాడే పనికిమాలినోడు మమ్మల్ని పీకేది ఏవడు అని సదరు యువకుడికి దిమ్మతిరిగే సమాధానం ఇచ్చాడు సదరు అధికారి పట్ల కొందరు ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తూ వెనుదిరిగారు వివరాల్లోకి వెళితే సమయం ఆరుగంటల 40 నిమిషములు అవుతుంది దూర ప్రయాణాలు చేసే వాళ్లం ఉన్నాము ఎంతసేపు బస్సు ఆపుతారు అని ప్రయా ప్రశ్నించగా సదర్ ఫోటోలో కనబడుతున్న అధికారి మా ఇష్టం ఉన్న చోట ఆపుతాం నేను చదువుకొని జాబ్ లోకి వచ్చాను నన్ను పీకేది ఎవడు లేదు అంటు ప్రయాణికులతో మహిళలతో దుర్భాషలాడుతూ అంతేకాకుండా ఒక యువకుడు బస్సు లాగేసుకొని ఏం చేసుకుంటావో చేసుకో నీ దిక్కున్న చోట చెప్పుకో అంటూ ఆ యువకున్ని ఆ అధికారి బస్ నుండి బయటకు లాగేసాడు ఇప్పుడిప్పుడే ఆర్టీసీ కష్టాలనుండి గట్టెక్కడానికి ఆర్టిసి ఎండి సజ్జనార్ గారు మరియు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ నిత్యం అభివృద్ధి బాటలో ప్రయాణించే విధంగా కృషి చేస్తున్న ఇటువంటి అధికారుల వల్ల ఆర్టీసీపై ప్రయాణికులకు అసహనం కలుగుతుంది అధికారి తీరుపట్ల బాధిత యువకుడు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ కు వాట్సప్ ద్వారా మరియు ఆర్టీసీ ఎండీ సజ్జనర్ కు ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేశారు