చర్ల టీఆర్ఎస్ లో భగ్గుమన్న వర్గ విభేదాలు

–  సొసైటీ అధ్యక్షుడు పై సొంత పార్టీ నాయకులే కర్రలతో దాడి

చర్ల ఏప్రియల్ 6 (నిజం న్యూస్) చర్ల మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. వ్యక్తిగత దూషణలు భౌతిక దాడులకు దారితీశాయి చర్ల బస్టాండ్ సెంటర్ సమీపంలో టిఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షులు.

also read : 2 కోట్లను తీసుకెళ్తున్న వ్యాన్ స్వాధీనం

చర్ల సొసైటీ అధ్యక్షులు పరుచూరి రవి కుమార్ పై సొంత పార్టీ నాయకులే కర్రలతో దాడి చేశారు వివరాల్లోకి వెళితే. టిఆర్ఎస్ మండల ప్రధానకార్యదర్శి నక్కిన బోయిన శ్రీనివాస్ యాదవ్ పుట్టినరోజు శుభాకాంక్షల విషయంలో ఫోనులో పరుచూరి రవికుమార్ కు. నక్కిన బోయిన శ్రీనివాస్ యాదవ్ కు వాగ్వివాదం జరగడంతో నక్కిన బోయిన శ్రీనివాస్ యాదవ్ తన అనుచరులతో వచ్చి కర్రలతో పరుచూరి రవికుమార్ పై దాడి చేసి కారును ధ్వంసం చేశారు రవి కుమార్ కు తలకు బలమైన గాయాలు కావడంతో రక్తం మడుగులో పడి ఉన్నాడు ఆయనను స్థానిక ఆసుపత్రికి తరలించారు పరిస్థితి విషమించ డంతో మెరుగైన వైద్యం కోసం భద్రాచలం తరలించారు . పోలీసులు ఈ కేసు పై విచారణ చేపట్టారు