Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

10 లక్షల 20 వేల విలువ గల గుట్కా ప్యాకెట్స్ స్వాధీనం.

– పోలీసుల అదుపులో పట్టుబడిన నలుగురు వ్యక్తులు అరెస్ట్.

మణుగూరు ఏప్రిల్ 6 (నిజం న్యూస్)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు. ఏ ఎస్ పి డా” శబరీష్ ఐ పి యప్ ఆదేశాల మేరకు, మణుగూరు ఇన్స్పెక్టర్ మరియు యస్ ఐ లు మరియు సిబ్బంది, టీములుగా ఏర్పడి మణుగూరు పట్టణం లో ఏకకాలంలో పలుప్రదేశలలో తనికీ నిర్వహించగా, తెలంగాణ ప్రభుత్వం చే నిషేదించబడిన 19 పెద్ద బ్యాగులలో అంబర్ ప్యాకెట్స్ మరియు 2స్వాగత్ గుట్కా పెద్ద బ్యాగులను పట్టుకోవటం జరిగింది , వాటి విలువ సుమారు 10లక్షల 20 వేల రూపాయలు ఉంటుంది. 1) వనమాల వేణుగోపాల్ తండ్రి వైకుంఠం వయసు (45) కులము వైశ్య వృత్తి కిరణంషాప్ రూరల్ అశోక్ నగర్ మణుగూరు.2)వల్లభనేని. రవి కుమార్, తండ్రి , వెంకటేశ్వర్లు వయసు (50) కులము కమ్మ , వృత్తి వ్యాపారం కూనవరం . 3) షేక్ అబ్దుల్ మునాఫ్ పాషా తండ్రి, సాహెబ్ వయసు (34) సంవత్సరాలు , వృత్తి ఆటో డ్రైవర్ నీకే 1సెంటర్ మణుగూరు. 4)సముద్రాల వెంకటేశ్వర్లు, తండ్రి , రామకృష్ణ వయసు (42) సవత్సరాలు వృత్తి వ్యాపారం ఏరియా సుందరయ్య నగర్ మణుగూరు .5)చింతల, రమణయ్య, తండ్రి నాగేశ్వరావు, కులం యాదవ జీఎం ఆఫీసు సింగారం మణుగూరు . ఈ నిషేధిత గుట్టలను సముద్రాల ,వెంక్నన అనే అతను చతిస్గడ్ రాష్ట్ర, కుంట నుండి తీసుకొని వచ్చి షాపులో విక్రయించ మని నలుగురు వ్యక్తులకు సరఫరా చేశాను అని చెప్పినాడు నిషేధిత గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకోవటం జరిగింది. పై వారందరిపై కేసు నమోదు చేసి తదు పరి చర్యల నిమిత్తం కోర్టుకు పంపడమైనది.