నితిన్‌ గడ్కరీతో వైఎస్‌ జగన్‌ భేటీ

జాతీయ రహదారుల ప్రాజెక్టులపై చర్చించేందుకు సమావేశం.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం ఢిల్లీ వెళ్లారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ మంగళవారం సాయంత్రం ప్రధాని మోదీతో ఆయన నివాసంలో సమావేశమయ్యారు. గంటకు పైగా జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధానితో చర్చించారు. ముఖ్యమంత్రి నివేదించిన అంశాలపై ప్రధాని సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.

కాగా, బుధవారం ఉదయం 9.15 గంటలకు కేంద్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం జగన్ భేటీ కానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధి కార్యక్రమాలపై కూడా ఆయన చర్చించనున్నారు. ముఖ్యమంత్రి కేంద్ర ఆర్థిక మంత్రి, కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్‌తో కూడా సమావేశమై పోలవరం ప్రాజెక్టుపై చర్చించారు. 45 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన నిర్మాణం, డిజైన్ల ఆమోదంపై చర్చించారు. కాఫర్ డ్యామ్ ఈసీఆర్‌ఎఫ్ డిజైన్‌లను జలశక్తి శాఖ ఇప్పటికే ఆమోదించింది