వృద్ధురాలు కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన 23వ వార్డ్ కౌన్సిలర్ పడిగేల రేణుక ప్రదీప్

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి ఏప్రిల్4(నిజం న్యూస్):

భువనగిరి పట్టణ 23వ వార్డు ఇందిరానగర్ లో ఆరోగ్యం బాగోలేక గాయపాక రాములమ్మ వృద్ధురాలు మృతిచెందారు. ఆ కుటుంబానికి సంబంధించిన ఇద్దరు మనుమలు ఉండడంతో స్థానిక కౌన్సిలర్ పడిగెల రేణుక ప్రదీప్ 5000/-₹ వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు.ఆయన మాట్లాడుతూ మనుమల ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో వాళ్లకు అన్ని విధాలుగా తోడుండి ఆదుకుంటామని తెలిపారు. వాళ్ళు ఉంటున్న ఇల్లు కూడా సరిగ్గా లేకపోవడంతో ప్రభుత్వం తరఫున వాళ్ళుకు ఇల్లు నిర్మాణం చేయుట కొరకు ప్రభుత్వం ఆదుకోవాలని ఇద్దరు మైనర్ పిల్లలు ఉండడంతో వాళ్ల విద్యాబుద్ధులు లు ప్రభుత్వం తరఫున అందజేయాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గాయపాక స్వామి లక్ష్మి శ్రావణ్ లక్ష్మీనారాయణ పద్మ నర్సింగ్ రావు వెంకటేష్ కసరబోయిన సాయి తదితరులు పాల్గొన్నారు.