రేపు ఢిల్లీకి వెళ్లనున్న వైఎస్‌ జగన్‌

ప్రధాని నరేంద్ర మోదీతో పలు అంశాలపై చర్చించనున్న జగన్‌ ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. నిన్న సాయంత్రం ఆయన నేరుగా ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు. ఈ సమావేశానికి సంబంధించి ఇప్పటికే అపాయింట్‌మెంట్ తీసుకున్నట్లు సమాచారం.ఇటీవలే ఎంపీ విజయసాయిరెడ్డి ప్రధాని మోదీ, సీఎం జగన్‌ల భేటీ సాధ్యమవుతుందని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఏపీలో అమలవుతున్న సంక్షేమ పథకాలకు, ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరనున్నారు.ఏపీ విభజన హామీలను కూడా సీఎం జగన్ ప్రధానికి చెప్పనున్నారని సమాచారం. అలాగే పాలనా వికేంద్రీకరణ తమ ప్రభుత్వ లక్ష్యమని, మూడు రాజధానులలో కేంద్రం సహకారం తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు, కొత్త పొత్తులపై వీరిద్దరి మధ్య చర్చ జరిగే అవకాశం ఉంది.