భాజపా-కాంగ్రెస్ నేతలు తెలంగాణపై విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నారని గిరిజన, సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ ధ్వజమెత్తారు

హైదరాబాద్ బ్యూరో ఏప్రిల్ 4 (నిజం న్యూస్) పార్లమెంట్ సాక్షిగా కేంద్రమంత్రి స్మృతి ఇరానీ అసత్యాలు మాట్లాడుతున్నారని ఆమె మండిపడ్డారు. పార్లమెంట్‌లో సాగుతున్న ప్రశ్నలు సమాధానాలు చూస్తుంటే కాంగ్రెస్‌, భాజపా రెండు ఒక్కటే అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. తెరాస శాసనసభాపక్ష సమావేశమందిరంలో రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, ఎమ్మెల్సీ వాణీదేవితో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సత్యవతి రాథోడ్ మాట్లాడారు.

కేంద్రమంత్రి వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు సత్యవతి స్పష్టం చేశారు. అంగన్‌వాడీకి వచ్చే గోధుమలు స్టాక్ కూడా కేంద్రం ఇవ్వడంలేదని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఏప్రిల్‌ నుంచి కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లు ఇవ్వబోతున్నట్లు వెల్లడించారు. త్వరలోనే శుభవార్త వింటారని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. స్మృతి ఇరానీ బహిరంగ క్షమాపణ చెప్పాలని రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌ రెడ్డి డిమాండ్ చేశారు. గిరిజన రిజర్వేషన్‌ బిల్లుపై అసెంబ్లీలో తీర్మానం చేసి పంపామని తెలిపారు. కేంద