కేంద్రం వడ్లను కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ -ఆధ్వర్యంలో నిరసనలు
ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపుమేరకు
-శానంపూడి సైదిరెడ్డి ఆదేశానుసారం
నేరేడుచర్ల ,ఏప్రిల్ 04 (నిజం న్యూస్)
ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం పండించిన యాసంగి వడ్లను కొనుగోలు చేయాలని ఇచ్చిన పిలుపు మేరకు హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి ఆదేశానుసారం నేరేడుచర్ల మండల కేంద్రంలో సోమవారం టిఆర్ఎస్ శ్రేణులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు అనంతరం వారు మాట్లాడుతూ ఆరు కాలం కష్టపడి రైతు పండించిన వడ్లను కేంద్రం కొనుగోలు చేయకుండా రాష్ట్ర రైతులను ఇబ్బంది పెడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు గుజరాత్ లో ఏ విధంగా అయితే వడ్లను కొనుగోలు చేస్తున్నదో అదేవిధంగా తెలంగాణలోనూ వడ్లను కొనుగోలు చేయాలని మోదీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ చందమల్ల జయ బాబు వైస్ చైర్మన్ చల్ల శ్రీలత రెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు ఆరిబండి సురేష్ బాబు డిసిసిబి డైరెక్టర్ దొండపాటి అప్పిరెడ్డి మార్కెట్ చైర్మన్ యశోద రాములు ఎంపీపీ లక్కుమళ్ల జ్యోతి గ్రంథాలయ చైర్మన్ గుర్రం మార్కండేయ పి సి సి ఐ చైర్మన్ అనంతు శ్రీనివాస్ గౌడ్ కొణతం సత్యనారాయణరెడ్డి నాగండ్ల శ్రీధర్ ఆకారపు వెంకటేశ్వర్లు వల్లంశెట్ల రమేష్ బాబు చిత్తలూరి సైదులు పోక బత్తిని రాజేష్ వేమూరి నారాయణ మరియు కౌన్సిలర్లు సీనియర్ నాయకులు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు