సహా చట్టం జిల్లా సమన్వయ కమిటీ సభ్యులు గా కొడారి వెంకటేష్ నియామకం

సహా చట్టం జిల్లా సమన్వయ కమిటీ సభ్యులు గా కొడారి వెంకటేష్ నియామకం…
యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 3 (నిజం న్యూస్)
యాదాద్రి భువనగిరి జిల్లా సమాచార హక్కు చట్టం సమన్వయ కమిటీ సభ్యులు గా భువనగిరి కి చెందిన కొడారి వెంకటేష్ ను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి నియమించినట్లు,కొడారి వెంకటేష్ శనివారం ఒక ప్రకటణలో తెలిపారు. తన నియామకం కు కృషి చేసిన భువనగిరి రాజస్వలాధికారి భూపాల్ రెడ్డి కి, జిల్లా కలెక్టర్ కార్యాలయ పాలనాధికారి నాగేశ్వరాచారి కి, భువనగిరి రాజస్వలాధికారి కార్యాలయ పాలనాధికారి ఉపేందర్ రెడ్డి కి కొడారి వెంకటేష్ కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా లో సమాచార హక్కు చట్టం పై అవగాహన పెంపొందించుటకు, చట్టం దుర్వినియోగం కాకుండా కాపాడుటకు పాలనలో పారదర్శకత,జవాబుదారి తనం కోసం తనవంతు కృషి చేస్తానని, అవినీతి రహిత సమాజ నిర్మాణమే తన ద్యేయమని కొడారి వెంకటేష్ ప్రకటణలో తెలిపారు. తనని స హ చట్టం జిల్లా కమిటీ సభ్యులు గా నియమించిన జిల్లా కలెక్టర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.