గరిడేపల్లి లో ఉద్రిక్తత

సూర్యాపేట జిల్లా గరి డేపల్లి లో చేపల సొసైటీ చైర్మన్ ఎన్నికల్లో ఉద్రిక్తత చోటు చేసుకొంది..

చైర్మన్ ఎన్నిక జరగకుండా హుజూర్ నగర్ మార్కెట్ చైర్మన్ అడ్డు కుంటున్నారని భాదితులు ఆరోపిస్తున్నారు..అధికారాన్ని పోలీసులను అడ్డుపెట్టుకొని చైర్మన్ ఎన్నిక కు సంబంధించిన కాగితాలను చింపి వేసి వాయిదా వేయుస్తున్నారని భాదితులు ఆరోపిస్తున్నారు..

మార్కెట్ చైర్మన్ కడియం వెంకటరెడ్డి వలన గరిడే పల్లి మండలం లో తెరాస భ్రష్టు పట్టిందని భాదితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..మార్కెట్ చైర్మన్ వెంకటరెడ్డి వలన గరిడేపల్లి లో ముదిరాజ్ గూడెం తగిలపడి పోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు..

చైర్మన్ ఎన్నిక కోసం సభ్యులను బెదిరిస్తున్నారు..డబ్బు ఆశ చూపి కొనుగోళ్ల కు ప్రయత్నం చేస్తున్నారని తెరాస కు చెందిన బాధితుడు ఆరోపిస్తున్నారు..