Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ప్రభుత్వ భూమి పై విచారణ లేనట్లేనా??

సర్వే నెంబర్ 461 లో 27 గుంటలు భూమి ధరణి లో ఉన్నట్లుగా నమోదు.

భూమి పై విచారణ చేపట్టని నూతనకల్ తాసిల్దార్?

తాసిల్దార్ తీరుపై పలు అనుమానాలు??

ఆక్రమణ భూమి వివాదంపై ,తాసిల్దార్ కె బెదిరింపులా??

తాసిల్దార్ తో పాటు, పలు అధికారులకు, ప్రజాప్రతినిధులకు, చేతివాటం ఉన్నదా??

అధికార పార్టీ నాయకుడు భూమికోసం, రెవెన్యూ అధికారులకు జోరుగా డబ్బులు పంపిణీ చేసినట్లు ఆరోపణలు.

27 గుంటల భూమిని , జిల్లా కలెక్టర్ విచారణ చేసి తక్షణమే ఆధీనంలోకి తీసుకోవాలని, స్థానిక ప్రజలు, దళిత నాయకులు, కోరుతున్నారు.

సూర్యాపేట ,ఏప్రిల్ 1 నిజం న్యూస్.

నూతనకల్ మండల కేంద్రంలో కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ,అధికార పార్టీ నాయకుడు, అక్రమంగా ఆక్రమించుకోగా, అందులో పెద్ద ,పెద్ద తిమింగలాలు ఉండటంతో , స్థానిక తాసిల్దార్ కనీసం విచారణ కూడా చేపట్టకపోవడం దారుణమని, స్థానిక ప్రజలు, దళితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సర్వే నెంబర్ 461లో 27గుంటలు ప్రభుత్వ భూమి ఉన్నట్లు ప్రభుత్వ ధరణి వెబ్ సైట్ లో స్పష్టంగా ఉన్నప్పటికీ ,ఆ భూమి ఆక్రమణకు గురైందని, తెలిసి కూడా అధికారులు అటు వైపు కన్నెత్తి చూడడం లేదంటే పెద్దల హస్తం కచ్చితంగా ఉన్నట్లు, గ్రామస్తులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ భూమిని అధికార, ప్రతిపక్ష నాయకులు తిలా పాపం, తలా పిడికెడు అన్న చందంగా తీసుకోవాలని ఆరోపణలు వినపడుతున్నాయి.

తెలంగాణ రాష్ట్రములో పేదలకు న్యాయం జరుగుతుంది అనుకుంటే, అధికార పార్టీ నాయకులే, సంబంధిత రెవెన్యూ అధికారులకు ఆశలు చూపించి, అందిన కాడికి దోసుకోవడం శోచనీయమని ప్రజలు ఏకంగా విమర్శలు గుప్పిస్తున్నారు. పేదల పక్షాన ఉండాల్సిన ప్రతిపక్ష పార్టీలు, అధికార పార్టీకి అండగా ఉండడం సిగ్గు చెటని దళితులు విమర్శిసిస్తున్నారు.

ఏది ఏమైనా సర్వే నంబర్ 461 లో 27 గుంటల ప్రభుత్వ భూమి ధరణి లో ఉన్నప్పటికీ విశిష్ట అధికారాలు ఉన్న స్థానిక రెవెన్యూ అధికారి ఏమీ చేయలేకపోవడం కారణం ఏంటని ప్రశ్నిస్తున్నారు అధికార పార్టీ నాయకుల చేతిలో, ప్రభుత్వ అధికారులు బానిసలుగా మారారని విమర్శలు జరుగుతున్నాయి., తక్షణమే జిల్లా కలెక్టర్ స్పందించి, సర్వేనెంబర్ 461 లో లోని భూమి పై, విచారణ జరిపించి, కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్న , కనీసం విచారణ చేయని తాసిల్దార్ పై , చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మండల పేద ప్రజలు ,దళితులు కోరుతున్నారు..

సర్వేనెంబర్ 461 లో 27 గుంటల భూమి ప్రభుత్వానిదే….

నూతనకల్ మండల కేంద్రంలోని సర్వే నెంబర్ 4 61 లో 27 గుంటల భూమి, ప్రభుత్వ భూమిగా ధరణి లో ఉన్నది వాస్తవమేనని ,నూతనకల్ తాసిల్దార్ పేర్కొన్నారు. ఆక్రమణకు గురైందని, నోటీసులు ఇచ్చి, తిరిగి స్థలాన్ని ప్రభుత్వ అధీనంలోకి తీసుకుంటామని తెలిపారు.