జోరు గా ఇసుక అక్రమ దందా

నూతనకల్ ఏప్రిల్ 1(నిజం న్యూస్)
మండల పరిధిలోని తాళ్ల సింగారం గ్రామ శివారు లో గల పాలేరు వాగు నుండి ఇసుక ను అక్రమంగా జేసీబీ ల సహాయం తో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఆ గ్రామానికి చెందిన అధికార పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు, మీ సేవ నిర్వహికుడు ఇద్దరు కలసి వాగులో ఉన్న ఇసుక ను జేసీబీతో నీటి లో నుండి వాగు గట్టున డంపు చేసి అధిక ధరలకు విక్రహిస్తున్నారు.
ALSO READ: బంగ్లా లో కార్డన్ సెర్చ్
పట్టపగలు ఇంత దందా కొనసాగుతున్న, పోలీస్ లు కానీ, రెవిన్యూ అధికారులు కానీ ఒక కేసు నమోదు చేయక పోవడం గమనార్హం. నెల నెల అధికారులకు మాములు ఇస్తున్నాం మమ్ములను ఎవరు పట్టుకోరు అని ఇసుక అక్రమ దందా చేస్తున్న వారు పేర్కొనడం కోసమేరుపు.