గ్యాస్ బండ నెత్తిన పెట్టుకొని, కట్టెలు పట్టుకొని కాంగ్రెస్ పార్టీ మహిళలు వినూత్న నిరసన!

సామాన్యులపై గ్యాసు పెట్రోలు విద్యుత్ ధరలు పెంచి, భారంగా మారిన కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు.

జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు, తిరుమల ప్రగడ. అనురాధ కిషన్ రావు.

తుంగతుర్తి, మార్చి 31 నిజం న్యూస్

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం గ్యాస్, పెట్రోల్ నిత్యవసర, వస్తువులు, రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ వినియోగం, బస్ చార్జీలు పెంచి సామాన్య మనిషికి భారంగా మారాయని, జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు తిరుమల ప్రగడ ,అనురాధ కిషన్ రావు ఆవేదన వ్యక్తం చేశారు.

గురువారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మహిళలు నాయకుల ఆధ్వర్యంలో వినూత్న రీతిలో గ్యాస్ సిలిండర్ నెత్తిలో పెట్టుకొని, చేతిలో మహిళలు కట్టెల పట్టుకొని, నరేంద్రమోడీ డౌన్ డౌన్, కెసిఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ, నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పెంచిన డీజిల్ పెట్రోల్ గ్యాస్ విద్యుత్ ధరలు తగ్గించే వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పోరాటం తప్పదని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు దొంగ రీ గోవర్ధన్ రావు, కొండరాజు, పెద్ద బోయిన అజయ్ కుమార్, మోడ్రన్ శ్రీలత ఉపేందర్, రాంబాబు, వెంకన్న, సతీష్, రాజు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.