రాహుల్‌గాంధీతో రాష్ట్ర కాంగ్రెస్ నేతల బృందం భేటీ

హైదరాబాద్ బ్యూరో మార్చి 31 (నిజం న్యూస్ )ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీని రాష్ట్ర కాంగ్రెస్ నేతల బృందం కలిసింది. రాహుల్ గాంధీతో 18 మంది కాంగ్రెస్ నేతల బృందం భేటీ అయింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జానారెడ్డి, పొన్నాల, మధుయాస్కీతో పాటు పలువురు నేతలు రాహుల్ సమావేశయ్యారు. పార్టీ డిజిటల్ మెంబర్‌షిప్ వివరాలు రాహుల్ గాంధీకి నేతలు అందించారు.రాష్ట్రంలో తాజా పరిణామాలు, కార్యాచరణపై సమావేశంలో నేతలు చర్చించారు. పార్టీలో అంతర్గత విభేదాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలో రాహుల్ పర్యటించాలని కాంగ్రెస్ నేతలు కోరనున్నట్టు సమాచారం.