బంగ్లా లో కార్డన్ సెర్చ్

కార్డన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు

నాగారం మార్చి 31 నిజం న్యూస్

నాగారం మండలం బంగ్లా గ్రామ సమీపంలో గురువారం ఉదయం కార్డన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు .
సరైన పత్రాలు లేని వాహనాలలో 10 మోటార్ సైకిల్, 6 ఆటోలు, రెండు ట్రాక్టర్లను సీజ్ చేసిన పోలీసులు.
ఇందులో కొన్ని వాహనాల పత్రాలు తనిఖీ చేసి వాటికి చలాన్లు కూడా వేశారు.

also read: కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వడ్డే ఎల్లయ్య పై హత్యా యత్న ప్రయత్నం

నాగారం ఎస్ఐ హరికృష్ణ మాట్లాడుతూ
వాహన ప్రయాణం లో ప్రతి ఒక్కరూ వారి వారి వాహన పత్రాలు కలిగి ఉండాలని లేనిపక్షంలో వాహనాలు సీజ్ చేయడం జరుగుతుందని అలాగే వాహనాలపై ఎలాంటి స్టిక్కరింగ్ వేయరాదని తెలిపారు. ప్రతి ఒక్క వాహనదారులు రోడ్డు భద్రత సూచనలు పాటించాలని సూచించారు.
ఈ కార్డన్ సెర్చ్ లో నలుగురు ఎస్సైలు, ఒక ఆర్.ఎస్.ఐ, 8 మంది ఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్ తో 26 మంది కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.