వైయస్సార్ తెలంగాణ పార్టీ, టిఆర్ఎస్ నాయకుల మధ్య నాగారం లో ఘర్షణ!

ఇరువర్గాల మధ్య తోపులాట…. పోలీసులు రంగ ప్రవేశం.
గ్రామాల్లో ప్రజల సమస్యలు తెలుసుకుంటే పాపమా.
వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల ఆవేదన..
నాగారం మార్చి 30 నిజం న్యూ స్
కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం పోటాపోటీగా ధరలు పెంచి ప్రజలపై భారం మోపుతున్నారు.సుపరిపాలన చేయాలని ఓట్లు వేస్తే.. దగా పాలన చేస్తున్న ప్రభుత్వాలు.ప్రజాప్రస్థానంలో భాగంగా వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల 41 వ రోజు నాగారం మండలం లక్ష్మాపురం, నుండి పాదయాత్రను ప్రారంభించి పస్తాల గ్రామంలో 500 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకోవడంతో అక్కడ ఉన్న ప్రజలతో కాసేపు ముచ్చటించారు అనంతపురం పాదయాత్ర కొనసాగిస్తూ, శాంతినగర్ , గోపాలపురం, గ్రామాల నుండి పాదయాత్ర గా నాగారం మండలం చేరుకోవడంతో అధికార పార్టీ నాయకులు అడ్డుకున్నారు.
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ, అధికార పార్టీ నాయకులకు మధ్య కాసేపు వాగ్వాదం తోపులాట జరిగింది. పోలీసుల రంగప్రవేశంతో సజావుగా సాగిన షర్మిల ప్రజాప్రస్థానం యాత్ర అనంతరం మండల కేంద్రంలోని ప్రజలతో కలిసి మాటా ముచ్చట కార్యక్రమంలో పాల్గొని వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా వైయస్ షర్మిల మాట్లాడుతూ..
వడ్లు కొనుగోలు లో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రైతులకు కల్లబొల్లి మాటలు చెప్తూ రైతుల నడ్డి విరుస్తున్నారని అన్నారు.
కేసీఆర్ హయాంలో మోసపోని వర్గం లేదు. ఇంటికో ఉద్యోగమని మోసం చేశాడు. కేజీ టూ పీజీ ఉచిత విద్య
అని విద్యార్థులను మోసం చేశాడు. ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ భృతి ప్రతి నెలా రూ. 3016 ఇస్తానని మోసం చేశాడు. పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తానని చెప్పి మోసం చేశాడు. మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ ఇస్తామని మోసం చేశాడు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని మోసం చేసింది కెసిఆర్ కాదా అని ప్రశ్నించారు .
వైయస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ సమయానికి అందేది, మూడుసార్లు నోటిఫికేషన్లు వేసి ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత వైయస్ఆర్ వైయస్సార్ ది అని పొగిడారు .
2008లో ఒకేసారి జంబో డీఎస్సీ ద్వారా 50,000 ఉద్యోగాలు భర్తీ చేశారు. వైయస్ఆర్ పాలనలో నిరుద్యోగులు ఎవ్వరూ ఆత్మహత్యలు చేసుకోలేదని తెలిపారు.
కేసీఆర్ నాలుగు లక్షల అప్పులు చేసినా.. ఫీజు రీయింబర్స్ మెంట్కు నిధులు ఉండవు. ఆరోగ్యశ్రీకి నిధులు ఉండవు. రుణమాఫీ ఉండదు. మహిళా సంఘాల రుణాలకు వడ్డీలు చెల్లిద్దామన్నా నిధులు ఉండవు. బీడి బిచ్చం కల్లు ఉద్దర అన్నట్లు నాలుగు లక్షల కోట్ల అప్పులు చేసి, రూపాయి లేదంటున్నాడు కేసీఆర్. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినిట్లు ఈరోజు కేసీఆర్ ప్రజలను తాకట్టుపెట్టి అప్పులు తెచ్చి, ఆ అప్పులను మళ్లీ ప్రజలపైనే రుద్దుతున్నాడు. కేసీఆర్ ను నమ్మి మళ్లీ మళ్లీ మోసపోవద్దు.
ఎన్నికల సమయంలో ఎన్నో దొంగ హామీలు ఇస్తాడు. ఎన్నో గారడి మాటలు చెబుతాడు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. కేసీఆర్ మాటలు ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దు. కేసీఆర్ కు వచ్చే ఎన్నికల్లో గట్టి బుద్ధి చెప్పాలి. వైయస్ఆర్ తెలంగాణ పార్టీ ప్రజల కోసం కొట్లాడే పార్టీ. రాష్ట్రంలో కేసీఆర్ నియం పాలన పోవాలి అని విమర్శించారు.. వైయస్ఆర్ సంక్షేమ పాలన రావాలి. ప్రజలంతా వైయస్సార్ తెలంగాణ పార్టీని ఆదరించండి , తెలంగాణ అభివృద్ధి చేసి చూపిస్తాం.
ఈ సమావేశంలో తుంగతుర్తి వైయస్సార్ తెలంగాణ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సోమన్న, వైయస్సార్ తెలంగాణ పార్టీ నాయకులు ,అభిమానులు పాల్గొన్నారు .