టిఆర్ఎస్ పార్టీలోకి భారీ చేరికలు!

తుంగతుర్తి శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్.
తుంగతుర్తి, మార్చి 30 నిజం న్యూస్
హైదరాబాద్ పట్టణంలోని కళ్యాణపురి ఎమ్మెల్యే గారి నివాసంలో తుంగతుర్తి మండలం వెంపటి గ్రామానికి చెందిన,మాజీకాంగ్రెస్యూతఅధ్యక్షుడుగుండగానిఅనిల్ ,చిటుపాకకమలాకర్, కుంభంమల్లయ్య, అశోక్, కటికిరెడ్డి సంపత్ యాదవ్, పిట్టలనరేష్ ,రావులపల్లి వెంకన్న, అర్.నరేష్,దినేష్, వెంకటేష్, గట్ల లక్ష్మణ్, అనిల్, సతీష్,మురళి, రాజు,ప్రవీణ్ వారితో పాటు వివిధ పార్టీలకు చెందిన, 50 మంది నాయకులు TRS పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బుధవారం వారం రోజున తుంగతుర్తి శాసనసభ్యులు డా.గాదరి కిశోర్ కుమార్ సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలోకి చేరడం జరిగింది.
నూతనంగా పార్టీలోకి చేరిన వారిని గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో TRS మండల అధికార ప్రతినిధి తునికి సాయిలు గౌడ్,గ్రామ శాఖ అధ్యక్షుడు దేశబోయిన హరీష్ యాదవ్,ప్రధాన కార్యదర్శి జేక్కి సతీష్,TRSV మండల అధ్యక్షుడు రచ్చ నవీన్,జజుగాల్ల శ్రీనివాస్,అశ్విన్,ఉమేష్ గౌడ్,రమేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు