జిల్లాల పునర్వ్యవస్థీకరణపై నేడు సీఎం జగన్ సమీక్ష.

జిల్లాల పునర్విభజన అంశంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించనున్నారు. కొత్త జిల్లా కేంద్రాల్లో ఏర్పాట్లు, సిబ్బంది కేటాయింపులపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.నూతన తెలుగు సంవత్సరం ఉగాది నాటికి రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన జిల్లాలను పరిపాలన సౌలభ్యం కోసం సిద్ధం చేయాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో 26 జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత నెలలో ప్రకటించి, నిర్ణయంపై సూచనలు, అభ్యంతరాలను కోరిన సంగతి తెలిసిందే. ప్రభుత్వానికి పలు సూచనలు అందగా, అధికారులు పరిశీలించారు.
ఇదిలా ఉంటే కొత్త రెవెన్యూ డివిజన్లు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్ని జిల్లాల పేర్లను మార్చాలని, కొత్త రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేయాలని, జిల్లా కేంద్రాలను మార్చాలని, మరికొన్ని మండలాలను ఇతర జిల్లాలకు విస్తరించాలని డిమాండ్‌లు ప్రభుత్వానికి చేరాయి. వీటన్నింటిపై ప్రణాళికా శాఖ అధికారులతో పాటు రాష్ట్ర కమిటీ పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి సీఎంకు నివేదిక అందించింది. క్షేత్రస్థాయిలో పరిస్థితిపై అధికారులతో సీఎం జగన్ సమీక్షించారు.ఏఏ ప్రజాభిప్రాయ సేకరణతో ముందుకు వెళ్లాలని సీఎం నిర్ణయించినట్లు తెలిసింది. ఇవాళ సీఎం జగన్‌తో కొత్త జిల్లాల తుది సమావేశం జరగనుంది. మరికాసేపట్లో తుది గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.