పంతంగి టోల్ ప్లాజా. ఎత్తివేత అంటూ సోషల్ మిడియాలో హల్ చల్.?

నల్లగొండ మార్చి 29.(నిజంన్యూస్): పంతంగి టోల్ ప్లాజా. ఎత్తివేత అంటూ సోషల్ మిడియాలో హల్ చల్ చేస్తున్న నెటీజర్లు,
నేషనల్ హైవేల పై 60 కిలోమీటర్ల లోపుల ఉన్న టోల్స్ ని తీసేస్తారని ప్రకటన చేసిన విషయం తెలిసిందే.
కేంద్రం ప్రకటన తర్వాత ముందుగా పంతంగి టోల్ ఎత్తేస్తారని ప్రచారం జరిగుతుంది.
ఈ రోజు కొంతమంది ఏకంగా పంతంగి టోలో ఎత్తేసారని ఒక పోటో సృష్టించిన పోస్ట్ సోషల్ మిడియాలో రావడంతో హాట్ టాపిక్ గా మారింది.
పంతంగి టోల్ ఎత్తేసారనేది అవాస్తవం. పంతంగి టోల్ ప్లాజా ఎత్తేయ లేదు అనేది నిజంన్యూస్ పరిశీలనలో తేలింది.