పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత శిక్షణా శారీరక దారుడ్య పరీక్షలో 1557 మంది అభ్యర్థుల ఎన్నిక

జిల్లా యస్.పి రెమా రాజేశ్వరి ఐపిఎస్
అభ్యర్థుల కోరిక మేరకు రాత పరీక్షలో మార్పు ..
వచ్చే నెల ఏప్రిల్ 3 వ తేదీన ఆదివారం రోజు నల్లగొండ యన్.జి కళాశాలలో రాత పరీక్షా.

నల్లగొండ మార్చి 29.(నిజంన్యూస్): నల్లగొండ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత శిక్షణా లో భాగంగా మేకల అభినవ స్టేడియంలో నిర్వహించిన శారీరక దారుడ్య పరీక్షలో మొత్తం 2500 మంది అభ్యర్థులు పాల్గొనగా వీరిలో పురుష అభ్యర్థులు 1041, మహిళ అభ్యర్థులు 516 మంది మొత్తం 1557 మంది అభ్యర్థులు ఎంపిక కావడం జరిగింది.

ఈ శారీరక దారుడ్య పరీక్షలో ఎంపికైన అభ్యర్థులు వారిలో కొంత మంది అభ్యర్థులకు డిగ్రీ పరీక్షలు ఉన్నాయన్న కోరిక మేరకు ఈ నెల 31 వ తేదీన జరగాల్సిన పరీక్షను మార్పు చేస్తూ వచ్చే నెల తేదీ 03.04.2022 ఆదివారం రోజున ఉదయం 9 గంటల నుండి 11.30 గంటల వరకు నల్లగొండ యన్.జి కళాశాల నందు రాత పరీక్షా నిర్వహించనున్నారు. అభ్యర్థులు పరీక్ష రోజు తమకు అందజేసిన హాల్ టికెట్ తో సహా రావాలని శారీరక దారుడ్య పరీక్ష రోజు నమోదు చేసుకున్న ఫోన్ నెంబర్ కి మెస్సేజ్ రూపంలో కూడా వస్తాయని జిల్లా యస్.పి గారు తెలిపారు.