Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ప్రధాని మోడీ తో పరీక్షా పే చర్చా కార్యక్రమానికి అర్హత సాధించిన నవోదయ విద్యార్థి రేవంత్

ఏప్రిల్ 1న విద్యార్థులతో సంభాషించనున్న ప్రధాని మోడీ..

“పరీక్షా పే చర్చా కార్యక్రమానికి అర్హత సాధించిన నవోదయ విద్యార్థి రేవంత్..

ఎటపాక మార్చి 29 నిజం న్యూస్
ప్రధాని మోడీ ప్రతి సంవత్సరం పరీక్షల ముందు నిర్వహించే “పరీక్షా పే చర్చా   5వ ఎడిషన్  కార్యక్రమం ప్రారంభం అవనుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఏప్రిల్ 1, 2022న దేశవ్యాప్తంగా బోర్డు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులతో సంభాషించనున్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ప్రధానమంత్రి మోడీతో ముఖాముఖి మాట్లాడే అవకాశం ఉంటుంది. గత సంవత్సరం, కోవిడ్ మహమ్మారి కారణంగా ఏప్రిల్‌లో ఈ ఈవెంట్ వర్చువల్ మోడ్‌లో నిర్వహించారు. ఈ పరీక్షా పే చర్చా కార్యక్రమంలో విద్యార్థులు  పరీక్షల ఒత్తిడిని ఎలా అధిగమించాలనే విషయంపై అభిప్రాయాలను వెల్లడించనున్నారు.

also read: నూతనకల్ లో కోట్ల విలువైన ప్రభుత్వ భూమిపై అధికార పార్టీ నాయకుడి కన్ను

ఈ పరీక్షా పే కార్యక్రమానికి సౌత్ ఇండియా లో ఆంద్రప్రదేశ్ రాష్ట్రం నుండి తూర్పుగోదావరి జిల్లా ఎటపాక మండలం లోని నవోదయ లో 9వ తరగతి చదువుతున్న విద్యార్ధి మాస్టర్ తుర్రం రేవంత్ సెలెక్ట్ అయ్యాడని కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మీ రాజం తెలిపారు. డ్రాయింగ్ విభాగంలో అత్యున్నత ప్రతిభ కనభరిచినందుకు తుర్రం రేవంత్ సెలెక్ట్ అయినట్లు తెలిపారు.. రంజిత్ వేసిన పెంటింగ్ ను ఢిల్లీ లోని ఎగ్జిబిషన్ లో ప్రధాని సందర్శించనున్నారని తెలిపారు.రేవంత్ నేరుగా ప్రధానితో మాట్లాడనున్నట్లు తెలిపారు. నవోదయా కళాశాల నుంచి రేవంత్ సెలెక్ట్ అవటం పట్ల ఆర్ట్ టీచర్ విజయ దుర్గా అభినందించా.రువిద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా పూర్తి వివరాలను తెలుసుకోవచ్చునని ఈ సంవత్సరం త్వరలో పరీక్షల సీజన్ మొదలుకానుందున ఈ నేపథ్యంలో పరీక్షలకు హాజరయ్యే స్టూడెంట్స్ ప్రశాంతంగా , రిలాక్స్‌గా ఎలా ఉండాలో ప్రధాని మోడీ విద్యార్థులకు పలు సూచనలు చేయనున్నట్లు తెలిపారు. పరీక్షల కోసం ఎలా సిద్ధమవ్వాలి అనే విషయంపై ప్రధాన మంత్రి విద్యార్థులతో సంభాషించనున్నారు. ఈ కార్యక్రమంకి విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు అడిగే పలు ప్రశ్నలకు ప్రధాని సమాధానం తెలుపుతారని అన్నారు.