గుండె పోటు తో ఆర్టీసి కండక్టర్ బారతిరెడ్డి మృతి

మిర్యాలగూడ మార్చి 29.(నిజంన్యూస్):
వేములపల్లి వద్ద ఆర్టీసీ బస్సులో గుండెపోటుతో కండక్టర్ భారతి రెడ్డి మృతి చెందినది.
మిర్యాలగూడ డిపోలోకండక్టర్ గా చేస్తున్న బారతి, డ్యూటీలో మిర్యాలగూడ నుంచి నల్గొండకు వెళ్తున్న బస్సులో శెట్టిపాలెం ఎక్స్ రోడ్ సమీపంలో టికెట్స్ కొట్టడం పూర్తి కాగానే వెంటనే గుండెపోటుతో కుప్పకూలి పోయినది. వెంటనే బారతిరెడ్డి ని దగ్గరలో ఉన్న వేములపల్లి పిహెచ్ సి కి తీసుకెళ్ళి,అక్కడి నుండి మిర్యాలగూడ హాస్పటల్ కి తీసుకెళ్ళగా అప్పటికే చనిపోయినది డాక్టర్స్ తెలిపారు.
కండక్టర్ బారతిరెడ్డికి ఇద్దరు కుమార్తెలు ,మిర్యాలగూడ లోని హౌసింగ్ బోర్డ్ లో నివాసం ఉంటుంది.
బారతిరెడ్డి మరణవిర్త విన్న తోటి ఆర్టీసి సిబ్బంది దిగ్బాంతి వ్యక్తం చేసారు.