అద్వానంగా పోస్తున్న రామకృష్ణ తండా రోడ్డు

నాసిరకంగా రోడ్డు నిర్మాణం
4కిలోమీటర్లకు 2కోట్ల 21 లక్షలు మంజూరు.
నాణ్యత లోపించడం పట్ల తండా వాసులు ఆందోళన
నేరేడుచర్ల మార్చి 29 నిజం న్యూస్: నేరేడుచర్ల మండలంలోని ప్రోగ్రాం బండ తండ గ్రామపంచాయతీ పరిధిలో గల తండాలకు 2.1 కోట్లతో చేపడుతున్న నూతన రహదారి నిర్మాణం నాణ్యత లోపించడం పట్ల తండా వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మిర్యాలగూడ కోదాడ ఆర్అండ్బి రహదారి నుండి నుండి రామకృష్ణ తండా వరకు మంజూరైన పంచాయతీరాజ్ ప్రధానమంత్రి సడక్ యోజన కింద మంజూరైన రహదారి పనులు లు లోపభూయిష్టంగా నాణ్యత లేకుండా నిర్మిస్తున్నారు. నేరేడుచర్ల నుండి రామకృష్ణ తండా వరకు 4 కిలోమీటర్ల దూరానికి2 కోట్ల 21లక్షలు మంజూరు అయినవి. 2018లో టెండర్ వేసినప్పటికీ అప్పటి నుంచి ఇప్పటి వరకు పనులు చేయలేదు . గుత్తేదారులు తన పనులు పూర్తి చేసి చేతులు దులుపు కోవాలని రహదారి నిర్మాణాన్ని లోపభూయిష్టంగా నిర్మిస్తున్నారు. రోడ్డు పోసి ఒక్కరోజైనా పూర్తికాకముందే రహదారి మొత్తం కంకర తేలుతుంది. ఇప్పుడు ఈ రోడ్డు నాసిరకంగా పోయడం వల్ల ప్రజలు ఇబ్బందులకు గురు అవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి నాణ్యతగా రహదారి నిర్మాణం చేపట్టాలని చూడాలని తండా వాసులు కోరుతున్నారు