ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ లో12 వ ర్యాంక్ సాధించి సత్తా చాటిన మణుగూరు యువకుడు

ఏరియా జిఎం జక్కం రమేష్ తో పాటు పలువురి ప్రశంసలు
మణుగూరు మార్చి 29 (నిజం న్యూస్)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఏరియా ఏరియా వర్క్ షాప్ లో డిప్యూటీ జనరల్ మేనేజర్ డి జీ ఎం (ఈ& ఎం)గా పనిచేస్తున్న యం నర్సిరెడ్డి వెంకటలక్ష్మీ (ప్రభుత్వ ప్రధానోపాధ్యాయురాలు) దంపతులు కుమారుడు మనోజ్ రెడ్డి ఆల్ ఇండియా ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ లో 12వ ర్యాంకు సాధించి మణుగూరు ఖ్యాతిని ఇనుమడింపజేసే పలువురి ప్రశంసలు అందుకున్నాడు
వివరాల్లోకి వెళితే పివీ కాలనీకి సింగరేణి కుటుంబానికి చెందిన మనోజ్ రెడ్డి ఏడవ తరగతి వరకు స్థానిక సత్య భాస్కర స్కూల్ నందు 8 నుంచి ఇంటర్ మీడియట్ వరకు గుడివాడ గౌతమ్ స్కూల్ లో బీటెక్ యన్ ఐ టి కాలికట్ కేరళ రాష్ట్రం లో విద్యనభ్యసించాడు ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ లక్ష్యంగా తన చదువును కొనసాగించాడు అమ్మానాన్నల తోడ్పాటు గురువుల ప్రోత్సాహం తో మూడవ ప్రయత్నంలో ఆయన విజయం సాధించడం పట్ల మనోజ్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు కృషివుంటే మనుషులు రుషులవుతారు అనే శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకుని మూడవ ప్రయత్నంతో ముందుకెళ్లానని ఆ భగవంతుని అనుగ్రహం కూడా తోడైదంటాడు ఈ సందర్భంగా మనోజ్ రెడ్డి తల్లిదండ్రులు నర్సి రెడ్డి వెంకటలక్ష్మి దంపతులు సంతోషం వ్యక్తం చేశారు ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ లో తమ కుమారుడు ప్రతిభ కనబరచాడని తొలి నుండి ఇంజనీరింగ్ విద్యపై తమ కుమారునికున్న మక్కువ ను గుర్తించి తాము కూడా ఎంతగానో ప్రోత్సహించామని ఎన్నో ఏండ్ల కుమారుని శ్రమ ఫలించిందని ఆ సంతోషాన్ని తాము ఆస్వాదిస్తున్నామన్నారు.
“కన్న కొడుకు విద్యలో విజేత” గా విజయం సాధిస్తే ఆ కన్నవారి సంతోషానికి హద్దులు ఉండవన్నారు మనోజ్ ఇంతకుముందు హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ ఇంజనీరుగా బెంగళూరులో పనిచేసి ప్రస్తుతం హైదరాబాద్ తెలంగాణ విద్యుత్ సంస్థ విద్యుత్ సౌధ లో అసిస్టెంట్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడని ఒకవైపు ఉద్యోగిగా సంస్థ పట్ల అంకితభావంతో పని చేస్తూనే తన జీవిత లక్ష్యం ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ చదువు పట్ల శ్రద్ధ చూపిస్తూనే లక్ష్యాన్ని చేరుకున్నాడని వారన్నారుఏరియా జిఎం జక్కం రమేష్ మాట్లాడుతూ సింగరేణియుల పిల్లలు ఉన్నత శిఖరాలు అధిరోహించారంటే సింగరేణి కు సంస్థ కూడా ఎంతో గర్వకారణం అన్నారు ఉద్యోగుల పిల్లలను విద్య, క్రీడలు ,కళలలో రాణించేలా సింగరేణి యాజమాన్యం ఖర్చుకు వెనకాడకుండా ఎంతగానో ప్రోత్సహిస్తోందని ఆయన తెలిపారు మనోజ్ రెడ్డి ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ లో 12 వ ర్యాంక్ సాధించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేస్తూ మనోజ్ రెడ్డి కి ఆయన తల్లిదండ్రులు నర్సి రెడ్డి వెంకటలక్ష్మి లకు హార్దిక శుభాకాంక్షలు తెలిపారు “సాధించిన దానితో సంతృప్తి చెందక”మనోజ్ రెడ్డి ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగాలని మణుగూరు కు ఇంకా ఎంతో పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.