కంపౌండర్ల ఇష్టారాజ్యం … మృత్యువాత పడుతున్న రోగులు

జిల్లాలో వైద్యాధికారి ఉన్నట్లా ?లేనట్లా??
ప్రవేట్ దవాఖానాల్లో కాంపౌండర్ లది ఇష్టారాజ్యం తో … మృత్యువాత పడుతున్న రోగులు.
ప్రవేట్ దవాఖానా లా, యాజమాన్యాలకు కనుసైగలతో జిల్లా వైద్యాధికారులు…..
కడుపు నొప్పి, జ్వరాలతో వెళితే… దవాఖానాల్లో మృత్యువాత నా…… డబ్బులు పోయే.. రోగుల చచ్చే.
జిల్లాలో ప్రైవేట్ దవాఖానాల్లో ,తనిఖీలు చేయని వైనం.
వాసవి దవాఖాన, సంజీవని హాస్పిటల్ ల పై చర్య లు లేనట్లేనా….
నష్టపరిహారం అందించి, చేతులు దులుపు తున్న ప్రవేట్ దవాఖానాలు…
సూర్యాపేట, మార్చ్ 29 ,నిజం న్యూస్
గ్రామాలు ,పట్టణాల్లో వివిధ సమస్యలు, రోగాలతో ప్రైవేట్ దావఖాన కు వెళితే ఒక ఒకపక్క ఫీజులు… మరొక ప్రక్క టెస్టు లతో వేల రూపాయలు జోడించి అప్పులు చేసి, రోగం నయం చేసుకుందామంటే, కొండనాలుకకు మందు పెడితే… ఉన్న నాలిక ఊడినట్లు సామెత, చందంగా సూర్యాపేటలోని కొన్ని ప్రైవేటు దవాఖానా ల పరిస్థితి దిగజారడంతో, తెలిసీ తెలియని వెళ్లిన రోగులు, మృత్యువాత పడుతున్న సంఘటన ఆలస్యంగా, సూర్యాపేట జిల్లా కేంద్రంలో వెలుగు చూసింది….
సూర్యాపేట జిల్లా కేంద్రంలో వాసవి హాస్పిటల్ లో ప్రైవేటు కాంపౌండర్, తిరుమలగిరి మండలం తొండ గ్రామం నుంచి వచ్చిన యాదాద్రికి, పేషెంట్ కు కడుపు నొప్పి రావడంతో, సంబంధిత కాంపౌండర్, వచ్చీరాని వైద్యం చేయడంతో, చికిత్స పొందుతూ, మృత్యువాత పడ్డట్లు బంధువులు ఆరోపించారు… దీనితో చేసేదేమీలేక సదర్ దావకాన యజమాన్యం, ఒక లక్ష 50 వేల రూపాయలు ముట్టజెప్పి పంపించారు…
ఇలా ఉండగా సూర్యాపేటలోని సంజీవని దవాఖాన లో కూడా ఆత్మకూర్ ఎస్ , ఏపూర్ కు చెందిన తన్నీరు వీరమ్మ కడుపు నొప్పి రావడంతో దవాఖానాల్లో చేరింది అనంతరం పరీక్షలు నిర్వహించి, హెర్నియా చేయాలని చెప్పి ఆపరేషన్ చేసి వదిలేశారు దీనితో ఇంకా కడుపు నొప్పి కావడంతో, చేసేదేమీలేక హైదరాబాద్లోని గాంధీ కి తరలించగా, అక్కడ పరీక్ష నిర్వహించి, ఎవరు చేశారు ఎందుకు చేశారు అని ప్రశ్నించగా.. సూర్యాపేటలో చేయించాం తెలిపారు.
కొద్దిరోజులు అనంతరం చికిత్సపొందుతూ వీరమ్మ మృత్యువాత చెందింది. దీనితో తిరిగి వారు ఆపరేషన్ వికటించడం చేతనే ఇలా జరిగిందని దవాఖాన లో మృత దేహముతో ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయినప్పటికీ జిల్లా ఉన్నతాధికారులు ఈ విధమైన చర్యలు తీసుకోలేదని కుటుంబ సభ్యులు కన్నీరు పర్యంతమయ్యారు… ఇలా చెప్పుకుంటూ పోతే సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రతి ప్రైవేట్ దవాఖానకు ఒక చరిత్ర ఉందని చెప్పక తప్పదు. ఏది ఏమైనా వేల రూపాయలు ఇచ్చి ప్రభుత్వం ప్రత్యేకంగా జిల్లా ఉన్నత అధికారుల నియమిస్తే… వారు చేసేదేమీలేక. ప్రైవేట్ దవాఖాన యాజమాన్యంతో మమేకమై డబ్బులకు దాసోహమే ఎటువంటి కఠిన, నియమ నిబంధనలతో కూడిన చర్యలు, తీసుకోకపోవడంతో… మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా మారి… అమాయక రోగుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి.
ఇకనైనా నిద్రమత్తు నుండి .. జిల్లా అధికారులు మేల్కొని, జరుగుతున్న సంఘటనల పట్ల విచారణ జరిపించి. అవసరమైతే ప్రైవేట్ దవాఖాన యాజమాన్యం పై, క్రిమినల్ కేసు నమోదు చేస్తూ, పేద కుటుంబాలకు న్యాయం చేయాలని, బాధిత కుటుంబ సభ్యులు, మేధావులు, వివిధ పార్టీ నాయకులు కోరుతున్నారు….