టీఆర్ ఎస్ పార్టీకి వడ్డేపల్లి రవి దంపతులు రాజీనామా!

కోమటిరెడ్డి బ్రదర్స్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ఆశాభావం వ్యక్తం.
సూర్యాపేట ,మార్చ్ 28 నిజం న్యూస్
గత కొంత కాలంగా టిఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటూ ,వస్తున్న టీఆర్ ఎస్ జిల్లా నాయకులు డాక్టర్ వడ్డేపల్లి రవి, ఆయన సతీమణి 10వ వార్డు కౌన్సిలర్ వడ్డేపల్లి రాజ్యలక్ష్మి లు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు సోమవారం ఒక ప్రకటన లో తెలిపారు. కొన్ని అనివార్య కారణాల వల్ల పార్టీని వీడుతున్నట్లు తెలిపారు. భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు వారు తెలుపుతూ, భవిష్యత్ కార్యాచరణ త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. ఏది ఏమైనా తిరిగి కాంగ్రెస్ పార్టీలో కి రావడం శుభ పరిణామంగా చెప్పొచ్చు…